Delhi High Court : నిబంధనలు పాటిస్తేనే విమాన ప్రయాణం
లేకపోతే దించేయమంటూ ఢిల్లీ కోర్టు ఆదేశం
Delhi High Court : కరోనా తగ్గుముఖం పట్టిందన్న సాకుతో చాలా మంది మాస్క్ లు, ముందు జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రధానంగా విమానాశ్రయాల్లో, విమానాల్లో ప్రయాణిస్తున్న వారు నియమ నిబంధనల్ని గాలికి వదలి వేశారు.
ఈ మేరకు ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ లు కచ్చితంగా ధరించాల్సిందేనని స్పష్టం చేసింది ఢిల్లీ కోర్టు(Delhi High Court) ధర్మాసనం. ఈ మేరకు డీజీసీఏను ఆదేశించింది.
అంతే కాకుండా ఎవరైనా సరే , ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉన్న వారైనా సరే నిబంధనలు పాటించాల్సిందేనని, లేని పక్షంలో వారికి భారీ ఎత్తున జరిమానా విధించాలని ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది.
సంచలన కామెంట్స్ కూడా చేసింది. ఒక వేళ మాస్క్ లు ధరించక పోతే, లేదా ధరించేందుకు ఇష్ట పడక పోతే, మారాం చేస్తే వెంటనే విమానాల్లోంచి అలాంటి వారిని దించేయాలని స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించి ఎవరూ మినహాయింపు కాదని పేర్కొంది. ఇదిలా ఉండగా విమాన ప్రయాణంలో కోవిడ్ రూల్స్ పాటించడం లేదంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
దీనిపై విచారించింది ధర్మాసనం(Delhi High Court). కీలక తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించి వెంటనే ఆయా ఎయిర్ పోర్ట్ లకు, విమాన సంస్థలకు కచ్చితమైన, స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డీజీసీఏను ఆదేశించింది ధర్మాసనం.
రూల్స్ అతిక్రమించే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకునేలా విమానశ్రాయాలు, విమానాల సిబ్బందికి అధికారాలు ఇస్తూ ప్రత్యేక మార్గ దర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది.
Also Read : ఆర్మీ చీఫ్ ..ధోవల్ తో అమిత్ షా భేటీ