AP Rajyasabha Elections : వైసీపీ రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవం
విజయ సాయి..కృష్ణయ్య..మస్తాన్ ..రెడ్డి ఎన్నిక
AP Rajyasabha Elections : ఏపీలో రాజ్యసభ ఎన్నికలు(AP Rajyasabha Elections) ముగిశాయి. అధికార వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన వారిలో ఆర్. కృష్ణయ్య, విజయ సాయి రెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి ఉన్నారు.
అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి,, వైసీపీ చీఫ్ సందింటి జగన్ మోహన్ రెడ్డి అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ బహుజన నాయకుడు, బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఏకైక నాయకుడు ఆర్. కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బున్న వాళ్లకు సీట్లు కేటాయిస్తే జగన్ రెడ్డి మాత్రం బీసీలకు ప్రయారిటీ ఇచ్చారు. ఏపీకి చెందిన వారు కాకుండా తెలంగాణకు చెందిన కృష్ణయ్యను ఎంపిక చేయడం చర్చకు దారి తీసింది.
అయినా వైసీపీ శ్రేణులు సీఎం జగన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా బహుజనులకు ప్రయారిటీ ఇచ్చిన ఘనత తమ సీఎంకే దక్కుతుందని వారన్నారు.
ఇక ఎన్నిక విషయానికి పోటీ చేసిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ (ఎన్నికల) అధికారి డిక్లరేషన్ ఇచ్చారు. ఎన్నికైన ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ రెడ్డి అజెండా మేరకు తాము పని చేస్తామని చెప్పారు. పార్టీ చీఫ్, సీఎం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇక ఆర్.కృష్ణయ్యది వికారాబాద్ జిల్లా మొయిన్ పేట మండలం రాళ్లడుగుపల్లి. బీద మస్తాన్ రావు ప్రముఖ వ్యాపారవేత్త. విజయ సాయి రెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు.
మరోసారి ఎన్నికయ్యారు. నిరంజన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.
Also Read : గ్యాస్ లేకేజీపై సీఎం జగన్ ఆరా