Gautam Adani : భిన్న వ్యాపారాలలో అదానీ పెట్టుబడి
కొత్త రంగాలలోకి అదానీ గ్రూప్ ఇన్వెస్ట్
Gautam Adani : ఆసియా కుబేరులలో టాప్ లో కొనసాగుతున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సరికొత్తగా దూసుకు పోతున్నారు. కేవలం రెండు మూడు రంగాలకే కాకుండా వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
వైవిధ్యాన్ని చాటుతూ విస్తృత వ్యాపార ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల సిమెంట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఓడ రేవుల నుండి విమానాశ్రయాలు, ఇంధనం దాకా విస్తరించారు బిలియనీర్ గౌతమ్ అదానీ.
కొనుగోళ్లు , పెట్టుబడి ప్రకటనల ద్వారా సిమెంట్ ఉత్పత్తిలోకి ప్రవేశించారు. అనంతరం ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి ఎంటర్ అయ్యారు. ఇతర రంగాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు.
తాజాగా మరో ప్రచారం జరుగుతోంది. ఈనెల 12న బీసీసీఐ నిర్వహించే అతి పెద్ద ఐపీఎల్ డిజిటల్, మీడియా ప్రసార హక్కుల బిడ్ లో పాల్గొననున్నట్లు టాక్. ఇప్పటికే రిలయన్స్ వయాకామ్ 18 పేరుతో రైట్స్ చేజిక్కించు కునేందుకు ప్లాన్ చేసింది.
దీని ద్వారా బీసీసీఐ రూ. 50, 000 వేల కోట్లు తీసుకోవాలని అనుకుంటోంది. తాజాగా అదానీ గ్రూప్(Gautam Adani) కంపెనీలు యూపీలో రూ. 70, 000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని వల్ల రాష్ట్రంలో 30,000 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది.
ఈ విషయాన్ని గౌతమ్ అదానీ(Gautam Adani) వెల్లడించారు కూడా. అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ హహాన్ సిపట్ ట్రాన్స్ మిషన్ లైన్ ను రూ. 1,913 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఎస్సార్ పవర్ తో ఒప్పందం చేసుకుంది.
అదానీ గ్రూప్ $10.5 బిలియన్లకు స్విస్ సిమెంట్ తయారీ సంస్థ హోల్సిమ్ ఇండియా కార్యకలాపాలను కొనుగోలు చేసింది. దీంతో సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది.
Also Read : ప్రతిభ సరే తొలగింపు మాటేంటి