Rahul Dravid Malik : ఊహల్లో కాదు వాస్తవంగా ఆడాలి – ద్రవిడ్
ఉమ్రాన్ మాలిక్ పై సంచలన కామెంట్స్
Rahul Dravid Malik : జమ్మూ కాశ్మీర్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై సంచలన కామెంట్స్ చేశాడు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). స్వదేశంలో సౌతాఫ్రికాతో భారత జట్టు 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.
ఈనెల 9 నుంచి మ్యాచ్ లు ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో నెట్స్ లో ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి పోయారు. రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లపై ఫోకస్ పెట్టారు. ఒక్కొక్కరు ఎలా ఆడాలో, వాళ్లకు ఉన్న బలాలు ఏమిటో ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు.
మైదానంలో కొత్తగా జట్టులోకి ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ కోచ్ ద్రవిడ్(Rahul Dravid Malik) తో కలిశాడు. ప్రధానంగా ఎలా బౌలింగ్ చేయాలో, బ్యాటర్లను ఎలా ఇబ్బంది పెట్టాలో సూచనలు ఇచ్చాడు.
పనిలో పనిగా ఎవరి కామెంట్స్ ను పట్టించు కోవవద్దని సూచించాడు. ఊహల్లో కాకుండా వాస్తవంలోకి రావాలని పేర్కొన్నాడు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). ఇదిలా ఉండగా ఐపీఎల్ లో ఉమ్రాన్ మాలిక్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఆడాడు.
14 మ్యాచ్ లు ఆడాడు. 22 వికెట్లు పడగొట్టాడు. 157 కిలోమీటర్ల వేగంతో రెండో వేగవంతమైన బౌలింగ్ చేసి రికార్డు సృష్టించాడు ఉమ్రాన్ మాలిక్. ఇదిలా ఉండగా టీ20 మ్యాచ్ లో మాలిక్ కు ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది ద్రవిడ్ మీద ఆధారపడి ఉంది.
ఈ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మీడియాతో మాట్లాడాడు హెడ్ కోచ్. నెట్స్ లో ఉమ్రాన్ బౌలింగ్ అద్భుతంగా ఉందన్నాడు.
ఎంత ఎక్కువగా ఆడితే అంతగా రాటు దేలుతాడని స్పష్టం చేశాడు ద్రవిడ్. ప్రతి ఒక్కరికి చాన్స్ ఇవ్వడం కుదరదన్నాడు.
Also Read : పేసర్లను ఎదుర్కోవడం మాకు సరదా