AUS vs SL T20 : రెచ్చి పోయిన వార్నర్ రాణించిన ఫించ్
10 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం
AUS vs SL T20 : శ్రీలంకతో జరిగిన తొలి టీ20 తొలి మ్యాచ్ లో ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా(AUS vs SL T20) జట్టు. ప్రపంచ చాంపియన్ ఆసిస్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. స్టార్ హిట్టర్లు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెల రేగాడు.
ఆరోన్ ఫించ్ దుమ్ము రేపాడు. ఇక వార్నర్ కేవలం 44 బంతులు ఆడాడు. 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 9 ఫోర్లు ఉన్నాయి. ఫించ్ 40 బంతులు ఆడి 61 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో 4 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 19.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. నిసాంక
31 బంతులు ఆడి 36 రన్స్ చేశాడు.
2 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు. గుణ తిలక 15 బంతులు ఆడి 26 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు. అసలంక 34 బంతులు ఆడి 38
రన్స్ చేశాడు ఇందులో ఒక సిక్స్ 3 ఫోర్లు ఉన్నాయి.
ఈ ముగ్గురు తప్ప ఇంకే శ్రీలంక బ్యాటర్ ఆడలేక పోయారు. చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా జట్టుకు చెందిన బౌలర్లు చుక్కలు చూపించారు లంక బ్యాటర్లకు. ఏకంగా 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
సత్తా చాటాడు. స్టార్క్ 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దుమ్ము రేపాడు. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా(AUS vs SL T20)
వికెట్ నష్ట పోకుండా 14 ఓవర్లలో 134 పరుగులు చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది.
కాగా ఇదే వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొత్తంగా డేవిడ్ వార్నర్ గత 2021 నుంచి అద్భుతమైన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
Also Read : వాళ్లందరి కంటే జో రూట్ సూపర్
I love Warner Bhai and finch Bhai those r Tsunami of Australian crickets