Matthew Mc Conaughey : ఇంకెంత కాలం కాల్పుల మోత
తుపాకులతో బతకలేన్న మాథ్యూ
Matthew Mc Conaughey : అగ్రరాజ్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఎక్కడో ఒక చోట కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న బైడెన్ ప్రభుత్వం చట్టం తీసుకు రావాలని అనుకుంటోంది.
కానీ ట్రంప్ మద్దతుదారులు ఒప్పు కోవడం లేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించాలని అనుకుంటున్న అమెరికా ఇప్పుడు తనను తాను రక్షించు
కోలేని స్థితిలో ఉండడం ఇబ్బందికరంగా మారింది.
ఈ తరుణంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, డల్లాస్ బయ్యర్స్ క్లబ్ చిత్రానికి గాను 2014లో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న మాథ్యూ మెక్ కోనా ఘే(Matthew Mc Conaughey) షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన వైట్ హౌస్ వేదికగా అత్యంత శక్తివంతమైన మాటలతో మెస్మరైజ్ చేశారు. వరుస కాల్పుల ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగించిన తీరు ఇప్పుడు యావత్ అమెరికానే కాదు ప్రపంచాన్ని సైతం కంట తడి పెట్టించేలా చేసింది.
ఇలా ఇంకెంత కాలం కాల్పులతో మనం దేశాన్ని ముందుకు నడిపించ గలమని అనుకుంటున్నారని ప్రశ్నించారు మాథ్యూ. మనం దేనినైతే
రక్షణ కోసం తయారు చేసుకున్నావే అవే మనల్ని నియంత్రిస్తున్నాయి.
మనల్ని నామ రూపాలు లేకుండా చేస్తున్నాయి. ఇందుకేనా మనం ఉన్నది అని అన్నారు. ఉవాల్టేను సందర్శించాను. బాధితుల్ని
పరామర్శించాను. నేను వారికి భరోసా ఇవ్వగలను కానీ కోల్పోయిన ప్రాణాలను తిరిగి ఇవ్వలేను.
ఇలా జరగడానికి కారణం ఎవరు. మీరు నేను కాదా. ఈ సమాజంలో, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం బాధ్యులమే. బాధ్యత కలిగిన వ్యక్తులు
సరిగా ప్రవర్తించక పోతే వచ్చే పరిణామాలు ఇలాగే ఉంటాయని హెచ్చరించారు.
ఇకనైనా మనం మారుదాం. కలిసి ఎదుర్కొందాం. మనకు కావాల్సింది తుపాకులు కావు శాంతి కావాలి. పరస్పరం మాట్లాడు కోవడం కావాలి.
పలకరించు కోవడం కావాలి. ద్వేషాలను వదిలేద్దాం. కలిసి నడుద్దాం శాంతి కోసమని పిలుపునిచ్చాడు మాథ్యూ మెక్ కోనా ఘే.
Also Read : మహేష్ ‘మురారి వా’ సాంగ్ వారెవా