Iran Foreign Minister : అజిత్ దోవల్ తో ఇరాన్ మంత్రి భేటీ
భారత ప్రభుత్వం చర్యల పట్ల సంతృప్తి
Iran Foreign Minister : ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్డోల్లాహియాన్ గురువారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి.
ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న మహ్మద్ ప్రవక్తపై చేసిన కామెంట్స్ విషయం ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అజిత్ దోవల్.
భారత దేశం వెంటనే స్పందించిన విధానం, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తొలగించిన తీరు, చర్యలు చేపట్టిన అంశం, కేసులు నమోదు చేసిన విషయం గురించి పూర్తిగా వివరాలు తెలిపారు దోవల్.
దాంతో ఇరాన్ ఫారిన్ మినిస్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అజిత్ దోవల్ చెప్పిన విధానం తమకు నచ్చిందన్నారు మంత్రి. ఇదిలా ఉండగా నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ప్రపంచ వ్యాప్తంగా 57 ముస్లిం దేశాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. కువైట్, ఖతార్ , ఇతర గల్ఫ్ కంట్రీస్ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. మరో వైపు అల్ ఖైదా ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది.
ఈ తరుణంలో ఇరాన్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి(Iran Foreign Minister) భారత్ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అజిత్ దోవల్ తో భేటీ అనంతరం ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ములాఖత్ అయ్యారు.
ఇదిలా ఉండగా వివాదాలు నెలకొన్న తరుణలో వాణిజ్యం, కనెక్టివిటీ , ఉగ్రవాద నిరోధక సహకారంపై భారత్ , ఇరాన్ విస్తృతంగా చర్చలు జరిపాయి.
Also Read : పరమత సహనం అవసరం – యుఎన్