Mamata Banerjee : ఆ నేతల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు
నిప్పులు చెరిగిన సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీకి చెందిన నూపుర్ శర్మ, ఆమె వ్యాఖ్యల్నిసపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసిన ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నవీన్ జిందాల్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
కేసులు నమోదు చేశారు సరే ఇప్పటి వరకు ఎందుకు వారిద్దరినీ అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించారు టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee). ఇతరులకు ఒక న్యాయం బీజేపీకి ఒక న్యాయమా అని ఆమె నిలదీశారు.
కేంద్రంలోని సర్కార్ తమ వారి పట్ల ఇతర పార్టీల నాయకుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చని పేర్కొన్నారు.
కేసులు నమోదు చేయడం వల్ల లాభం లేదని, ఇదంతా జనాన్ని, దేశాన్ని మభ్య పెట్టేందుకు ఆడుతున్న ఓ నాటకమని ఆమె నిప్పులు చెరిగారు.
కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల పేరుతో విభేదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని భావించే బీజేపీకి మాట్లాడే నైతికత కోల్పోయిందన్నారు.
బేషరత్తుగా నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఇతరులను గేలి చేయడం, అవమాన పర్చడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీకి, దాని అనుబంధ సంస్థలకు ఒక అలవాటుగా మారిందన్నారు.
బీజేపీ నేతల దిగజారు మాటల కారణంగా ప్రపంచంలో భారత పరువు గంగలో కలిసిందని ఎద్దేవా చేశారు దీదీ. ఇదిలా ఉండగా మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కానీ వారి గురించి ప్రస్తావించ లేదు.
కొందరు ద్వేష పూరిత ప్రసంగాలు చేస్తూ అస్థిరం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : అస్సాం కేబినెట్ విస్తరణ