David Miller : కిల్ల‌ర్ ఇన్నింగ్స్ ఆడిన మిల్ల‌ర్

చేతులెత్తేసిన భార‌త బౌల‌ర్లు

David Miller : ఐపీఎల్ 2022లో దంచి కొట్టిన సౌతాఫ్రికా స్టార్ హిట్ట‌ర్ మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో రుచి చూపించాడు. ఇలా కూడా ఆడ‌తారా అన్న‌ట్టు చెలరేగాడు. అల‌వోక‌గా ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు.

భారీ ల‌క్ష్యం అత‌డి ముందు చిన్న బోయింది. స‌హ‌చ‌ర క్రికెట‌ర్ వారెన్ డ‌సెన్ క‌లిసి 64 బంతులు మాత్ర‌మే ఆడి 131 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

దీంతో సౌతాఫ్రికా జ‌ట్టు ఆతిథ్య జ‌ట్టు టీమిండియాపై 7 వికెట్లు తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 211 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన స‌ఫారీ టీం డ‌సెన్ , మిల్ల‌ర్(David Miller) ల జోర్దార్ ఇన్నింగ్స్ దెబ్బ‌కు చేతులెత్తేసింది. కేవ‌లం 31 బంతులు మాత్ర‌మే ఆడిన మిల్ల‌ర్ 64 ర‌న్స్ చేశాడు. 4 ఫోర్లు 5 సిక్స‌ర్లు ఉన్నాయి.

భార‌త బౌల‌ర్ల పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ప‌రుగులు రాబ‌ట్టాడు. మొద‌ట్లోనే కెప్టెన్ తెంబా బవుమా వికెట్ ను కోల్పోయింది. కేవ‌లం 10 ప‌రుగులు చేసి వెనుదిరిగాడు.

చెల‌రేగి ఆడుతున్న ప్రిటోరియ‌స్ ను హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాత మిల్ల‌ర్ క్రీజు లోకి రావ‌డంతో సీన్ పూర్తిగా మారి పోయింది. డికాక్ 22 ప‌రుగులే చేసి వెనుదిరిగాడు.

కానీ భారీ ల‌క్ష్యాన్ని అల‌వోక‌గా ఛేదించ‌డంలో ద‌క్షిణాఫ్రికా స‌క్సెస్ అయ్యింది. 5 మ్యాచ్ ల టి20 సీరీస్ లో 1-0 ఆధిక్యంతో కొన‌సాగుతోంది. విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడిన కిల్ల‌ర్ మిల్ల‌ర్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Also Read : మిల్ల‌ర్ జోర్దార్ డ‌సెన్ షాన్ దార్

Leave A Reply

Your Email Id will not be published!