Bhagwant Mann : హర్మన్ ప్రీత్ కౌర్ కు సీఎం కంగ్రాట్స్
పంజాబ్ రాష్ట్రానికి గర్వ కారణం
Bhagwant Mann : భారత క్రికెట్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న హైదరాబాదీ క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది. 23 ఏళ్ల పాటు క్రికెట్ ఆడింది.
ఆమె రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పంజాబ్ కు చెందిన స్టార్ విమెన్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ ను కెప్టెన్ గా ప్రకటించింది.
ఈ సందర్భంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Bhagwant Mann) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మా బిడ్డకు అరుదైన గౌరవం దక్కిందని, దేశం తరపున ప్రాతినిధ్యం , నాయకత్వం వహించే అవకాశం రావడం తాము అదృష్టంగా భావిస్తున్నామని సీఎం పేర్కొన్నాడు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా భగవంత్ మాన్ స్పందించారు. మీ ప్రతిభా పాటవాలతో దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు.
ప్రపంచ స్థాయిలో చరిత్ర సృష్టించాలని కోరారు సీఎం. భారత మహిళా జట్టుకు కెప్టెన్ గా ఎంపికైనందుకు ప్రత్యేక శుభాకాంక్షలు. అంతే కాదు ప్రత్యేక అభినందనలు అని తెలిపారు భగవంత్ మాన్.
ఇదిలా ఉండగా బీసీసీఐ హర్మన్ ప్రీత్ కౌర్ ను రాబోయే శ్రీలంక సీరీస్ కు గాను వన్డే జట్టుకు నాయకురాలిగా నియమించింది. హర్మన్ ప్రీత్ గొప్ప బ్యాటర్. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ సంచలన కామెంట్స్ చేశారు మిథాలీ రాజ్ గురించి.
క్రికెట్ ఆడడం అనేది కల. తాను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను విన్న ఏకైక పేరు ఒక్కటే మిథాలీ రాజ్. ఈ ఆటలో రావాలని అనుకున్న వారికి, ఆడుతున్న వారికి మీరు ఎల్లప్పుడూ స్పూర్తిగా నిలుస్తారని పేర్కొంది.
Also Read : ఆటకే వన్నె తెచ్చిన అందం
ਪੰਜਾਬ ਦੇ ਮੋਗਾ ਸ਼ਹਿਰ ਦੀ ਜੰਮਪਲ ਸਾਡੀ ਧੀ @ImHarmanpreet ਨੂੰ ਭਾਰਤੀ ਮਹਿਲਾ ਕ੍ਰਿਕਟ ਟੀਮ ਦੀ ਕਪਤਾਨ ਬਣਾਏ ਜਾਣ ‘ਤੇ ਵਧਾਈਆਂ..
ਮਿਹਨਤ ਜਾਰੀ ਰੱਖੋ..ਆਪਣੀ ਖੇਡ ਪ੍ਰਤਿਭਾ ਨਾਲ ਦੇਸ਼ ਸਮੇਤ ਪੰਜਾਬ ਦਾ ਨਾਂਅ ਦੁਨੀਆ ਭਰ ‘ਚ ਬੁਲੰਦੀਆਂ ‘ਤੇ ਲੈ ਕੇ ਜਾਓ..ਮੇਰੇ ਵੱਲੋਂ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ pic.twitter.com/XiLxdvlGHp
— Bhagwant Mann (@BhagwantMann) June 9, 2022