IPL Media Rights : ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం ఉత్కంఠ
వైదొలిగిని అమెజాన్ ..గూగుల్
IPL Media Rights : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఐపీఎల్ డిజిటల్ , మీడియా రైట్స్ రాబోయే ఐదేళ్ల సంవత్సరాల కాలానికి మెగా బిడ్ ఆదివారం ప్రారంభించనుంది. ఈ వేలం పాటపై ఉత్కంఠ నెలకొంది.
దిగ్గజ కంపెనీలు రైట్స్(IPL Media Rights) చేజిక్కించుకునేందుకు రెడీ అవుతోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ , టెక్ దిగ్గజం గూగుల్ దరఖాస్తులు చేసుకున్నా తప్పుకున్నాయి.
వయా కామ్ 18, డిస్నీ స్టార్ , సోని, జీ గ్రూప్ , డ్రీమ్ 11తో పాటు పలు సంస్థలు పోటీలో ఉన్నాయి. విజయవంతమైన బిడ్డర్లు మ్యాచ్ లను ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంటారు.
2023 నుండి 2027 వరకు మీడియా హక్కుల కోసం కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. నాలుగు సంస్థలు తుది బిడ్ లను దాఖలు చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఈ వేలం పాటు రెండు రోజుల పాటు కొనసాగనుంది. బిడ్ లను నాలుగు విభాగాలుగా చేశారు. దీని ద్వారా రూ. 50,000 కోట్లు రానున్నట్లు అంచనా వేసింది బీసీసీఐ. వయా కామ్ 18, డిస్నీ స్టార్ , సోని- జీ నిలిచాయని తెలిపింది.
ఇందులో నాలుగు నిర్దిష్ట ప్యాకేజీలు ఉన్నాయి. ఇ – వేలం ద్వారా ఇది కొనసాగుతోంది. ఒక్కో సీజన్ కు 74 గేమ్స్ చేపడతారు. చివరి రెండేళ్లలో మ్యాచ్ ల సంఖ్యను 94కి పెంచే చాన్స్ ఉంది.
వీటిని ఎ, బి, సి, డి కింద విభజించారు. భారత ఉప ఖండం కోసం మీడియా హక్కులు(IPL Media Rights) ఉండగా బి ప్యాకేజీ కోసం డిజిటల్ హక్కుల కోసం వేలం పాట చేపడతారు. ఏస్ ఇండస్ట్రియల్ హౌస్ కూడా ఆసక్తి చూపుతోంది.
Also Read : సౌతాఫ్రికా జోరు భారత్ బేజారు