Venkatesh Prasad : మనం 21వ శతాబ్దంలోనే ఉన్నామా
మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్
Venkatesh Prasad : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దేశమంతా నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది.
ఈ తరుణంలో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఎప్పుడూ ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఉన్నట్టుండి వెంకటేశ్ ప్రసాద్ చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నుపుర్ శర్మ దిష్టి బొమ్మను ఉరి తీయడంపై ఆయన ఘాటుగా స్పందించాడు. రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ దేశ ప్రజలకు సూచించాడు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేమిటంటే మనం రాతి యుగంలో ఉన్నామా లేక 21వ శతాబ్దంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందంటూ అనుమానం వ్యక్తం చేశాడు వెంకటేశ్ ప్రసాద్.
ఇదిలా ఉండగా నూపుర్ శర్మకు వ్యతిరేకంగా కర్ణాటక లోని బెల్గావిలో మసీదు వద్ద ఆమె దిష్టి బొమ్మను వేలాడ దీశారు. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఈ మాజీ క్రికెటర్. ఆమె దిష్టి బొమ్మను ఉరి తీస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే అసలు మనం ఎక్కడున్నాం.
ఈ శతాబ్ధంలోనే బతుకుతున్నామా అని పేర్కొన్నారు. దయచేసి రాజకీయాలను పక్కన పెట్టండి. దేశం కోసం పాటు పడండి. ఇలాంటి వాటిని పట్టించుకుంటే విలువైన కాలం తిరిగి తెచ్చుకోలేమంటూ పేర్కొన్నాడు వెంకటేశ్ ప్రసాద్.
ఇది కేవలం దిష్టి బొమ్మ అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇలాగే కొనసాగితే అది పెను ముప్పునకు దారి తీసే ప్రమాదం ఉందంటూ హెచ్చరించాడు.
ప్రస్తుతం వెంకటేశ్ ప్రసాద్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కొందరు మద్దతుగా ట్వీట్ చేస్తే మరికొందరు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు.
Also Read : రూ. 42,000 కోట్లు దాటిన ఐపీఎల్ వేలం