Dileep Vengsarkar : సర్ఫరాజ్ ఖాన్ ను ఎందుకు తీసుకోలేదు
బీసీసీఐ మాజీ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్
Dileep Vengsarkar : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ సెలెక్టర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్(Dileep Vengsarkar) సర్కార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరు అద్భుతంగా ఉందన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ను భారత జట్టులోకి తీసుకోవాలని కోరాడు.
అతడు అన్ని విధాలుగా అర్హుడని పేర్కొన్నాడు. ఇందుకు ఖాన్ ఆడిన అన్ని గణాంకాలను ఈ సందర్భంగా వెంగ్ సర్కార్ గుర్తు చేశాడు. ఇలాంటి క్రికెటర్ వుంటే జట్టుకు అదనపు బలం చేకూరుతుందని పేర్కొన్నాడు.
అతడు ఆడుతున్న ఆట తీరును చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపాడు. భారత దేశీవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీలో తన అద్భుతమైన రికార్డును కొనసాగించాడు.
ఈ ఏడాది రంజీ ట్రోఫీలో చిమరి మూడు లీగ్ మ్యాచ్ లలో సర్ఫరాజ్ ఖాన్ 165, 63, 48 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ పై జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో స 153 పరుగులు చేశాడని తెలిపాడు వెంగ్ సర్కార్.
గత సీజన్ లో 928 రన్స్ చేశాడని పేర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో సగటు 80.42గా ఉందని తెలిపాడు. ఇప్పటి వరకు ఇంత బాగా పర్ ఫార్మెన్స్ చేసినా ఎందుకు బీసీసీఐ సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ వెంగ్ సర్కార్ ప్రశ్నించాడు.
సర్ఫరాజ్ ఖాన్ ముంబై నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు జట్టు తరపున ఆడాలి. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నా పట్టించు కోవడం లేదంటూ ఫైర్ అయ్యాడు.
Also Read : జో రూట్ జోర్దార్ పోప్ సూపర్