Rishabh Pant : సత్తా చాటుతాం సీరీస్ గెలుస్తాం – పంత్
రెండో టీ20 ఓటమి తర్వాత కెప్టెన్ కామెంట్
Rishabh Pant : స్వదేశంలో సఫారీ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టి20 సీరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో చేతులెత్తేసింది భారత జట్టు. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్పీకి రెస్ట్ ఇచ్చింది.
ఇదే సమయంలో మరో స్టార్ ఆటగాడు స్టాండ్ బై కెప్టెన్ కేఎల్ రాహుల్ నెట్ ప్రాక్టీస్ లో గాయపడడంతో తప్పుకున్నాడు. దీంతో బీసీసీఐ రిషబ్ పంత్(Rishabh Pant) కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో ఘోరంగా ఓటమి పాలైంది. భారత బౌలర్ల కు చుక్కలు చూపించారు దక్షిణాఫ్రికా స్టార్ హిట్టర్లు డేవిడ్ మిల్లర్, డసెన్. ఆ జట్టును ఒడ్డుకు చేర్చారు.
ఇక కటక్ వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్ లో దుమ్ము రేపారు. మరో విజయాన్ని సాధించారు . 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది సఫారీ టీం. ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ప్రత్యేకించి భారత బౌలర్ల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో పాటు కెప్టెన్ రిషబ్ పంత్ పేలవమైన నాయకత్వం పై కూడా మాజీ ఆటగాళ్లు మండి పడుతున్నారు.
తాజాగా రెండో మ్యాచ్ ఓటమి అనంతరం రిషబ్ పంత్(Rishabh Pant) మీడియాతో మాట్లాడారు. తాము మరికొన్ని పరుగులు చేయడంలో విఫలమయ్యామని చెప్పారు.
ఇతర బౌలర్లు బాగా చేశారని, కానీ తాము రాణించ లేక పోయామన్నారు. సెకండాఫ్ లో వికెట్లు తీయక పోవడం వల్లనే ఓటమి పాలయ్యామని చెప్పారు రిషబ్ పంత్.
మిగతా మూడు మ్యాచ్ లలో తాము సత్తా చాటుతామని సీరీస్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కెప్టెన్.
Also Read : సర్ఫరాజ్ ఖాన్ ను ఎందుకు తీసుకోలేదు