Angelo Mathews Tuba : ప్లేయ‌ర్ ఆఫ్ మంత్ గా ఏంజెల్..తుబా

క‌ష్టాలే మ‌మ్మ‌ల్ని ఇలా ఆడేలా చేశాయి

Angelo Mathews Tuba : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌తి నెలా ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్ర‌క‌టిస్తుంది. ఇందులో పురుషుల విభాగం నుంచి ఒక‌రిని, మ‌హిళా క్రీడా విభాగం నుంచి మ‌రొక‌రిని డిక్లేర్ చేస్తుంది.

సోమ‌వారం మే నెల కు గాను ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఊహించ‌ని రీతిలో శ్రీ‌లంక క్రికెట‌ర్ ఏంజెలో మాథ్యూస్(Angelo Mathews)  ఎంపిక‌య్యాడు. ఇక మ‌హిళ‌ల విభాగం నుంచి పాకిస్తాన్ కు చెందిన స్టార్ స్పిన్న‌ర్ తుబా(Tuba) హ‌స‌న్ ను ఎంపిక చేసింది ఐసీసీ.

త‌న మ్యాజిక్ స్పెల్ తో అద్భుతంగా బౌలింగ్ చేసి దుమ్ము రేపింది తుబా హ‌స‌న్. ఆమె స్పిన్ మంత్ర‌జాలానికి క్రీడాభిమానులు విస్తు పోయారు.

అయితే ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ ల‌లో శ్రీ‌లంక ప్లేయ‌ర్ ఏంజెలో మాథ్యూస్ అద్భుతంగా ఆడాడు. చ‌ట్టో గ్రామ్, మీర్పూర్ టెస్టుల్లో క‌లిపి ఏకంగా 344 ర‌న్స్ సాధించాడు.

ఇందులో 199, 145 ప‌రుగులు ఉన్నాయి. ఏంజెలో మాథ్యూస్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో శ్రీ‌లంక జ‌ట్టు సీరీస్ గెల‌వ‌గ‌లిగింది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారానికి ఎంపికైన మొద‌టి శ్రీ‌లంక క్రికెట‌ర్ గా నిలిచాడు ఏంజెలో మాథ్యూస్.

ఈ సంద‌ర్భంగా త‌న‌ను ఎంపిక చేసినందుకు సంతోషం వ్య‌క్తం చేశాడు మాథ్యూస్. త‌న‌ను ఎంపిక చేసిన శ్రీ‌లంక క్రికెట్ బోర్డుకు, స‌హ‌క‌రించిన కెప్టెన్ , తోటి ఆట‌గాళ్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

జీవితంలో ఎదురైన ఇబ్బందులే ఇలా ఆడేందుకు కార‌ణ‌మైందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు మాధ్యూస్. ఇక శ్రీ‌లంక‌తో జ‌రిగిన టి20 సీరీస్ లో పాకిస్తాన్ స్పిన్న‌ర్ 21 ఏళ్ల తుబా హ‌స‌న్ స‌త్తా చాటింది. 5 కీలక వికెట్లు తీసి చ‌రిత్ర సృష్టించింది.

Also Read : ఐపీఎల్ రైట్స్ ద‌క్కించుకున్న సోనీ..జియో

Leave A Reply

Your Email Id will not be published!