BCCI : మాజీ క్రికెట‌ర్ల పెన్ష‌న్లు పెంపు – బీసీసీఐ

ప్ర‌క‌టించిన కార్య‌ద‌ర్శి జే షా

BCCI : మాజీ క్రికెట‌ర్ల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది బీసీసీఐ. నెల వారీగా చెల్లించే పెన్ష‌న్ మొత్తాన్ని పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

ఈ నిర్ణ‌యం వ‌ల్ల దేశంలోని 900 మాజీ క్రికెట‌ర్ల‌కు ఈ సౌక‌ర్యం క‌లుగుతుంద‌ని తెలిపారు. ఇందులో మాజీ క్రికెట‌ర్లు అయిన పురుషులు, మ‌హిళల‌కు వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించారు.

అంతే కాకుండా వీరితో పాటు మ్యాచ్ అధికారులు ( అంపైర్లు, ఇత‌ర సిబ్బంది ) కూడా ఉన్నార‌ని పేర్కొన్నారు. దాదాపు 75 శాతం మంది సిబ్బంది 100 శాతం పెంపుతో ల‌బ్దిదారులుగా ఉండబోతున్నారంటూ స్ప‌ష్టం చేశారు.

మాజీ క్రికెట‌ర్ల‌ను చూసుకోవ‌డం బీసీసీఐ(BCCI) బాధ్య‌త‌. ఎందుకంటే వారు దేశం త‌ర‌పున ఆడారు. వారి ఆర్థిక స్థితి గ‌తుల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు జే షా.

మాజీ ఆట‌గాళ్లు లైఫ్ లైన్ గా ఉంటారు. వారి ఆట ముగిశాక కూడా వారి త‌ర‌పున ఉండ‌డం మా కర్త‌వ్య‌మ‌ని తెలిపారు. అంపైర్లు నిజ‌మైన హీరోలు. వారిని గౌర‌వించ‌డం మా ధ‌ర్మం.

అందుకే రిటైర్ అయిన వారికి ఇది వ‌ర్తింప చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు బీసీసీఐ(BCCI) చీఫ్ సౌర‌వ్ గంగూలీ. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ 2022 స‌క్సెస్ చేసినందుకు గ్రౌండ్స్ మెన్ , క్యూరేట‌ర్ల‌కు రూ. 1.25 కోట్ల ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించింది బీసీసీఐ.

కాగా బీసీసీఐ నిర్ణ‌యంతో మాజీ క్రికెట‌ర్లు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ, కార్య‌ద‌ర్శి జే షాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : రికార్డు ధ‌ర‌కు ఐపీఎల్ మీడియా రైట్స్

Leave A Reply

Your Email Id will not be published!