KCR PK New Party : పీకే శ్రీకారం కేసీఆర్ ముహూర్తం
జాతీయ స్థాయిలో మోదీతో అమీ తుమీ
KCR PK New Party : రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం అయ్యేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది. పలు భాషల్లో ప్రావీణ్యం ఉండటం. జనానికి అర్థమయ్యేలా విషయాన్ని చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.
ఈ తరుణంలో జాతీయ స్థాయిలో పాతుకు పోయిన బీజేపీ పరివారానికి చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారు సీఎం. ఇక మోదీని పీఎం చేయడంలో
వెనుక ఉండి తతంగం నడిపించిన ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకే కేసీఆర్(KCR PK New Party) వెనుక ఉండడం అదనపు బలం కానుంది.
ఇప్పటికే పార్టీ పేరు కూడా ఖరారు చేసినట్లు టాక్. పదే పదే పీకే, కేసీఆర్ చర్చల్లో మునిగి పోయారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి నేతలు, ప్రముఖులు, నటీ నటులు, క్రీడాకారులు, అన్ని రంగాలకు చెందిన వారెవరో ఇప్పటికే ఓ జాబితా కూడా ఖరారు చేసినట్లు టాక్.
మొత్తానికి పీకే శ్రీకారం చుడితే సీఎం కేసీఆర్ పార్టీని ప్రారంభించనున్నారు. ఆ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి లేదా భారత నిర్మాణ సమితి అని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక సీఎంకు భక్తిపై నమ్మకం ఎక్కువ. ఆయనకు జ్యోతిష్కులు, పండితులు, స్వామీజీలు చెప్పే వాటిని ఎక్కువగా నమ్ముతారు. వారు
నిర్ణయించిన తేదీలు , ముహూర్తం చూసుకుని ఈనెల 17 నుంచి 23 లోపు ఏదో ఒక రోజు డిక్లేర్ చేయనున్నారు.
ఇందుకు సంబంధించి పార్టీ నియమావళి, ఎజెండా ఏం ఉండాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు టాక్. ఒకప్పుడు గుజరాత్ మోడల్ మోదీకి
ప్లస్ అయ్యిందో అలాగే పీకే(KCR PK New Party) తెలంగాణ అభివృద్ది మోడల్ దేశానికి ఆదర్శం అంటూ ప్రచారం చేయనున్నట్లు
జోరుగా ప్రచారం జరుగుతోంది.
పనిలో పనిగా చెల్లా చెదురుగా ఉన్న చిన్న పార్టీలు, సామాజిక సంస్థలు, ఇతర ప్రముఖుల్ని పార్టీలోకి చేర్చుకుంటే మరింత బలం
చేకూరుతుందని అంచనా వేస్తున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ కావడం చర్చకు దారి తీసింది.
ఇక సాంస్కృతిక కళా రూపాలను కూడా వాడుకోనున్నారు. మొత్తంగా సారు పెట్టే పార్టీ ఏమిటనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : తెలంగాణలో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ భారీ పెట్టుబడి