Cricket India : వందేమాతరం క్రికెట్ జపం
అనూహ్య స్పందన అపూర్వ ఆదరణ
Cricket India : సమున్నత భారతావని ముక్త కంఠంతో నినదించే ఏకైక పదం క్రికెట్. క్రికెట్ ఆట మాత్రమే కాదు అది కోట్లాది భారతీయులను కలిపే ఏకైక మతం.
అందుకే ఆ ఆటకు అంతటి ఆదరణ. మా తుఝే సలాం అంటూ జాతీయ పతాకాలను చేత పట్టుకుని నినదించే అరుదైన సన్నివేశాలు ఒక్క క్రికెట్ లోనే ఎక్కువగా కనిపిస్తాయి.
అంటే మిగతా ఆటలను తక్కువ చేసినట్టు కాదు. కానీ ఈ ఆటకు ఉన్నంత క్రేజ్ ఇండియాలో ఇంకేదీ లేదంటే అతిశయోక్తి కాదు. భారత దేశానికి క్రికెట్ పరంగా ఫీవర్ ను తీసుకు వచ్చేలా చేసింది ఒకే ఒక్కడు అతడే కపిల్ దేవ్ నిఖంజ్.
అండర్ డాగ్స్ గా పరిగణించిన ఈ జట్టు క్రికెట్ ప్రపంచం విస్తు పోయేలా 1983లో ప్రపంచ కప్ ను తీసుకు వచ్చింది. ఘన విజయాలు నమోదు చేస్తూ వచ్చిన వెస్టిండీస్ ను మట్టి కరిపించి భారత్ కు అరుదైన, చిరస్మరణీయమైన గెలుపు ను తీసుకు వచ్చాడు.
ఇక ఆనాటి నుంచి నేటి దాకా క్రికెట్ ఆట అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. వరల్డ్ కప్ తీసుకు వచ్చిన భారత జట్టుకు నభూతో నభవిష్యత్
అన్న రీతిలో స్వాగతం పలికింది.
అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ప్రెసిడెంట్ జైల్ సింగ్ ఆటగాళ్లను అభినందించారు. దివంగత రాజ్ సింగ్ దుర్గాపూర్ చొరవతో ఎలాంటి ఫీజు తీసుకోకుండానే దివంగత దిగ్గజ గానగాంధర్వ కోకిల లతా మంగేష్కర్ ఢిల్లీలో సంగీత కచేరి చేపట్టింది.
ఆ వచ్చిన డబ్బులతో క్రికెటర్లకు ప్రైజ్ మనీగా అందించారు. ఇక 1983 కంటే ముందు క్రికెట్ ఒక ఆట మాత్రమే కానీ కపిల్ దేవ్ కప్పు తెచ్చాక
క్రికెట్ స్వరూపం మారింది. దాని తీరే వేరై పోయింది.
భారత దేశాన్ని శాసించే స్థాయికి క్రికెట్(Cricket India) చేరింది. అది ఇప్పుడు ఓ విడదీయ లేని బంధం. టెస్టులు, వన్డేలు, టీ20ల దాని ఆట
మారింది. అంతకంతకూ కోట్ల నుంచి వేల కోట్లు సంపాదించే స్థాయికి చేరింది బీసీసీఐ.
ఇవాళ పురుషులే కాదు మహిళలు సైతం క్రికెట్ అంటే చెవి కోసుకుంటున్నారు. పడి చస్తున్నారు. అది లేకుండా ఉండలేమంటున్నారు.
మారుతున్న టెక్నాలజీ క్రికెట్ ను మరింత దగ్గర చేసింది. కోట్లు కురిపించేలా చేసింది. మొత్తంగా నవ యువ భారతం క్రికెట్ జపం చేస్తోంది.
వందే మాతరం అంటూ నినదిస్తోంది. మేరా భారత్ మహాన్.
Also Read : సమున్నత భారతం క్రికెట్ ఓ మతం