Kapil Dev : ఆనాటి విజయం నేటి క్రికెట్ కు ఊతం
రియల్ క్రికెటర్ గ్రేట్ ప్లేయర్ కపిల్ దేవ్
Kapil Dev : భారత క్రికెట్ చరిత్రలో ఓ మైలు రాయి చోటు చేసుకుంది. అత్యధిక ఆదాయం కలిగిన ఆటగా ఇండియన్ ప్రీమియం లీగ్ (ఐపీఎల్ ) నిలిచింది. కేవలం ఆటగా కాదు డిజిటల్, టీవీ ప్రసార హక్కుల కోసం జరిగిన ఈ వేలం పాటలో రికార్డు ధర పలికింది.
2023-2027 వరకు అంటే ఐదేళ్ల కాల పరిమితికి ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆదాయం సమకూరింది. ఒకటా రెండా ఏకంగా రూ. 48, 390 కోట్లు వచ్చాయి బీసీసీఐకి. మరి ఒకప్పుడు హాకీ భారత దేశానికి సంబంధించి జాతీయ క్రీడ.
కానీ క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ గా పరిగణిస్తూ వచ్చిన క్రికెట్ ను భారత దేశానికి ఫీవర్ లా తీసుకు వచ్చేలా చేయడంలో కీలకంగా మార్చింది
మాత్రం ఒకే ఒక్కడు.
అతడే క్రికెట్ దిగ్గజం. భారత దేశం గర్వించ దగిన అరుదైన ఆటగాడు. హర్యానాకు చెందిన కపిల్ దేవ్ నిఖంజ్. అతడి సారథ్యంలోనే భారత జట్టు ఎవరూ ఊహించని రీతిలో 1983లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ను సాధించింది.
ఆనాటి నుంచి నేటి దాకా భారత దేశంలో ఇప్పుడు క్రికెట్ ఒక ఆక్టోపస్ లాగా వ్యాపించింది. క్రికెటర్ల ముందు సినీ తారలు దిగదిడుపే. అంతలా
పాపులర్ అయ్యేలా చేయడంలో మాత్రం కపిల్ దేవ్(Kapil Dev) ద్వారానే జరిగింది.
టెస్టులు, వన్డేలు, టీ20లు గా రూపాంతరం చెందింది క్రికెట్. భారత దేశంలోని 140 కోట్ల మంది జనం నిరంతరం జపించే ఏకైక మతం క్రికెట్.
అంతే కాదు ఒక్క మ్యాచ్ ను 6 కోట్ల మందికి పైగా ఏకకాలం చూసే గేమ్ ఏదైనా ఉందంటే అది ఈ ఆట మాత్రమే.
అందుకే అంత డిమాండ్. ఇవాళ భారత దేశాన్ని , ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి చేరుకుంది క్రికెట్. దాని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దానికున్న పవర్ ఏమిటో.
Also Read : బీసీసీఐని బలోపేతం చేసిన దాల్మియా