ENG vs NZ 2nd Test : బెయిర్ స్టో షాన్ దార్ ఇంగ్లాండ్ జోర్దార్
న్యూజిలాండ్ పై సంచలన విజయం
ENG vs NZ 2nd Test : లార్డ్స్ లో ఊహించని టార్గెట్ ను ఛేదించడంలో సక్సెస్ అయిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ట్రెంట్ బ్రిడ్జ్ లో పర్యాటక న్యూజిలాండ్(ENG vs NZ 2nd Test) జట్టుతో జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఫస్ట్ టెస్టులో మాజీ కెప్టెన్ జో రూట్ చెలరేగి ఆడాడు. తన జట్టుకు సక్సెస్ అందించాడు. అదే రూట్ , పోప్ తో కలిసి షాన్ దార్ ఇన్నింగ్స్ నమోదు
చేశాడు ట్రెంట్ బ్రిడ్జిలో. 176 పరుగులు చేసి సత్తా చాటాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చి పోయారు. తక్కువ పరుగులకే కట్టడి చేశారు. బెయిర్ స్టో ఎన్నడూ లేని రీతిలో రెచ్చి
పోయాడు. ఆకాశమే హద్దుగా ఆడాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు.
ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. నువ్వా నేనా అన్న రీతిలో ఆఖరి వరకు ఆట సాగింది. చివరి దాకా హోరా హోరీగా జరిగింది ఈ మ్యాచ్.
ఇక బెయిర్ స్టో కీలక భూమిక పోషించాడు.
కేవలం 92 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ స్టార్ ్లేయర్ 14 ఫోర్లు 7 సిక్సర్లతో రెచ్చి పోయాడు. బెయిర్ స్టో ఫోర్లు, సిక్సర్లు కలిపి 98 పరుగులు వచ్చాయి.
మొత్తం 136 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు సెకండ్ ఇన్నింగ్స్ లో. దీంతో ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు
చేసింది. దీంతో మూడు టెస్టుల మ్యాచ్ సీరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది.
ఇక ఆట విషయానికి వస్తే ఆఖరి రోజు ఇంగ్లండ్(ENG vs NZ 2nd Test) గెలవాలంటే 74.3 ఓవర్లలో 299 రన్స్ చేయాలి. బెయిర్ స్టోతో పాటు ఇంగ్లండ్
కెప్టెన్ బెన్ స్టోక్స్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. 70 బంతులు ఆడి 10 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చి పోయి ఆడాడు.
75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతకు ముందు కీవీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 553 రన్స్ చేస్తే రెండో ఇన్నింగ్స్ లో 284 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 539 రన్స్ చేసింది.
Also Read : బెంగాల్ టైగర్ టార్చ్ బేరర్