Gopal Krishna Gandhi : ఎవరీ గోపాల కృష్ణ దేవదాస్ గాంధీ
రాష్ట్రపతి రేసులో బాపూ మనవడు
Gopal Krishna Gandhi : దేశ రాజకీయాలు వేడెక్కాయి. అత్యున్నతమైన పదవిగా భావించే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జూలై 18న పోలింగ్ జరుగుతుంది.
21న ఫలితం వెల్లడవుతుంది. ఈసారి రాష్ట్రపతి పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ కు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజారిటీ లేదు.
దీంతో ప్రతిపక్షాలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో టీఎంసీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో
విపక్షాలతో భేటీ జరిగింది ఢిల్లీ వేదికగా.
ఈ తరుణంలో తమ తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఇద్దరి పేర్లను ప్రకటించింది. వారిలో జాతిపిత మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ(Gopal Krishna Gandhi) కాగా మరొకరు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఉన్నారు.
ఆయన పూర్తి పేరు గోపాలక కృష్ణ దేవదాస్ గాంధీ. 22 ఏప్రిల్ 1945లో పుట్టారు. ఐఏఎస్ గా పదవీ విరమణ చేశారు. 2004 నుండి 2009 మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పని చేశారు.
మాజీ ఐఏఎస్ అధికారిగా భారత రాష్ట్రపతికి సెక్రటరీగా కూడా పని చేశారు. శ్రీలంక, దక్షిణ ఆఫ్రికా దేశాలకు హై కమిషనర్ గా ఉన్నారు. 2017లో భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యుపీఏ తరపున నామినేట్ చేయబడ్డారు.
కాగా వెంకయ్య నాయుడి చేతిలో కేవలం 244 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1968లో ఐఏఎస్ అధికారిగా చేరారు. 1985 దాకా తమిళనాడు రాష్ట్రంలో సేవలందించారు.
1985 నుంచి 1987 దాకా భారత ఉప రాష్ట్రపతికి సెక్రటరీగా ఉన్నారు. 1987 నుంచి 1992 దాకా భారత రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా పని చేశారు గోపాలకృష్ణ గాంధీ(Gopal Krishna Gandhi).
2003లో పదవీ విరమణ పొందారు. 2011 నుండి 2014 వరకు చెన్నై లోని కళాక్షేత్ర ఫౌండేషన్ కు చైర్మన్ గా ఉన్నారు.
అంతే కాదు దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్ కు చైర్మన్ గా 2012 నుంచి 2014 దాకా సేవలు అందించారు. అశోకా యూనివర్శిటీలో చరిత్ర, రాజనీతి శాస్త్రాలకు ప్రొఫెసర్ గా ఉన్నారు.
Also Read : అతి పెద్ద గ్రంథాలయం దుబాయ్ ఆదర్శం