KCR JAGAN : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌పై వ్యూహాత్మ‌క మౌనం

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎటు వైపు

KCR JAGAN : దేశంలో ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఎన్నిక చ‌ర్చ‌కు దారి తీస్తోంది. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ బీజేపీయేత‌ర రాష్ట్రాలు, సీఎంలు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ త‌రుణంలో మోదీపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్(KCR JAGAN) , చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ వస్తున్న ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలు(KCR JAGAN ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎటు వైపు నిల‌బ‌డ‌తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఇదిలా ఉండ‌గా టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మోదీకి వ్య‌తిరేకంగా రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ప్ర‌తిప‌క్షాల త‌ర‌పున ఉమ్మ‌డి అభ్యర్థిని నిల‌బెట్టాల‌ని ప్ర‌తిపాద‌నలు చేసింది.

ఈ మేర‌కు ఆమె ఢిల్లీలో విప‌క్ష పార్టీల‌తో కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఈ భేటీకి కాంగ్రెస్ నేత‌లు కూడా హాజ‌రయ్యారు. ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ , ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ , మెహ‌బూబా ముప్తీ , మ‌ల్లికార్జున ఖ‌ర్గే, జై రాం ర‌మేష్ పాల్గొన్నారు.

ఇక పాల్గొన్న వాటిలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, వామపక్షాలతో పాటు 17 విపక్షాలు భేటీలో పాల్గొన్నాయి. టీఆర్‌ఎస్, బిజూ జనతాదళ్, ఆప్, అకాలీదళ్, మజ్లిస్‌ దూరంగా ఉన్నాయి.

కాగా నిన్న‌టి దాకా బీజేపీతో స‌త్ సంబంధాలు నెరిపిన టీఆర్ఎస్ ఎలాంటి వైఖ‌రి తీసుకుంటుంద‌నేది రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో తేలుతుంది. జ‌గ‌న్ పూర్తిగా స‌రెండ‌ర్ అయిన‌ట్లేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మోదీని ఢీకొనే సాహసం చేసే ద‌మ్ము ఎవ‌రికి ఉంద‌నేది ఈ ఎన్నిక‌ల్లో తేలుతుంది.

Also Read : ఎంపీ ర‌ఘురామ‌పై హైకోర్టు సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!