Adhir Ranjan Chowdhury : ఖాకీలా బీజేపీ కార్యకర్తలా – ఎంపీ
మేమేమైనా ఉగ్రవాదులమా
Adhir Ranjan Chowdhury : తాము ఏమైనా ఉగ్రవాదులమా అని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury). నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, అగ్ర నేత , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చింది.
సోనియాకు కరోనా రావడంతో ఆమె హాజరు కాలేదు. కానీ గత మూడు రోజుల పాటు ఈడీ రాహుల్ గాంధీని విచారించింది. మొదటి రోజు 10 గంటలకు పైగా విచారించింది.
రెండో రోజు 11 గంటలకు పైగా , మూడో రోజు 10 గంటల పాటు విచారించింది. పలు ప్రశ్నలు కురిపించింది. గతంలో ఈ కేసును కొట్టి వేసినా తిరిగి భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ , ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి సీబీఐకి మనీ లాండరింగ్ జరిగిందంటూ ఆరోపించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసింది. ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టింది. పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
రాజ్ భవన్ ముట్టడి తెలంగాణలో అరెస్ట్ లకు దారి తీసింది. ఈ తరుణంలో ఎంపీ అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) నిప్పులు చెరిగారు ఢిల్లీ పోలీసులపై. సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తప్పు పట్టారు.
పోలీసులు తనతో పాటు సీనియర్ నాయకులన్న గౌరవం లేకుండా అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. పోలీసులు పూర్తిగా బీజేపీ కార్యకర్తల్లాగా ప్రవర్తించారంటూ మండిపడ్డారు.
Also Read : కూల్చివేతలు చట్టానికి లోబడి ఉండాలి