Sourav Ganguly : టీ20 వరల్డ్ కప్ జట్టుపై గంగూలీ కామెంట్స్
ఎవరు ఉండాలనేది రాహుల్ ద్రవిడ్ చూస్తాడు
Sourav Ganguly : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా ఇంగ్లాండ్ టూర్ పూర్తయ్యాక ఎవరెవరు ఉండాలనే దాని గురించి భారత సెలెక్షన్ కమిటీ కంటే ఎక్కువగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై ఉంటుందని స్పష్టం చేశాడు గంగూలీ.
రెండు మూడు సీరీస్ లు అయ్యాక ఎవరు ఉండాలనేది ద్రవిడ్ ఎంపిక చేసుకునే చాన్స్ ఉందని పేర్కొన్నాడు. ఎందుకంటే అతడి మీదే ఎక్కువ బాధ్యత ఉంటుందని తెలిపాడు.
రెగ్యులర్, సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ , రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకోవడం లేదా గాయపడడం జరుగుతోంది.
బీసీసీఐ ఎంపిక కమిటీ ఎన్నో ప్రయోగాలు చేసింది. రిషబ్ పంత్ స్వదేశంలో సఫారీ జట్టుతో ఆడుతున్న టీమిండియాకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇక ఐర్లాండ్ లో పర్యటించే జట్టుకు హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించామన్నాడు గంగూలీ(Sourav Ganguly) .
ప్రపంచ కప్ ప్రాబబుల్స్ పై ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ విషయంపై రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లను పరిశీలిస్తున్నాడని తెలిపాడు.
ఇషాన్ కిషన్ , దినేష్ కార్తీక్ , హర్షల్ పటేల్ , భువనేశ్వర్ కుమార్ , అవేశ్ ఖాన్ , యుజ్వేంద్ర చాహల్ , పాండ్యా బాగా ఆడుతున్నారు. ఈ మధ్యనే రవి శాస్త్రి ఆసిస్ టూర్ లో సంజూ శాంసన్ ను తప్పక తీసుకోవాలని సూచించాడు.
ప్రస్తుతం గంగూలీ కంటే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పైనే ఎక్కువగా ఒత్తిడి ఉంటుందన్నది మాత్రం వాస్తవం.
Also Read : కార్తీక్ టీ20 వరల్డ్ కప్ కు ఆడాల్సిందే