SL vs AUS 3rd ODI : రెచ్చి పోయిన నిసాంక చెలరేగిన కుశాల్
9 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక విక్టరీ
SL vs AUS 3rd ODI : శ్రీలంకలో పర్యటిస్తున్న వరల్డ్ టి20 చాంపియన్ ఆస్ట్రేలియాకు కోలుకోలేని షాక్ తగిలింది. శ్రీలంతో జరిగిన కీలకమైన మూడో మ్యాచ్(SL vs AUS 3rd ODI) లో చేతులెత్తేసింది.
మొదటి వన్డే మ్యాచ్ లో ఆసిస్ చుక్కలు చూపిస్తే లంక రెండో మ్యాచ్ లో సత్తా చాటింది. ఇక మూడో మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఆస్ట్రేలియా(SL vs AUS 3rd ODI) పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉండగా 2013 సంవత్సరం తర్వాత అంటే
9 ఏళ్ల అనంతరం శ్రీలంక వరుసగా రెండు వన్డేల్లో గెలుపొందడం ఇదే మొదటి సారి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ కు దిగింది పర్యాటక జట్టు. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 291 రన్స్ చేసింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
4 ఫోర్లు ఒక సిక్సర్ తో 62 పరుగులు చేశాడు. మాథ్యూ హెడ్ దుమ్ము రేపాడు. 3 ఫోర్లు 3 సిక్సర్లతో 70 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అనంతరం 292 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో మైదానంలోకి దిగింది ఆతిథ్య శ్రీలంక జట్టు. కేవలం 48.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
ఆస్ట్రేలియాకు దిమ్మ తిరిగేలా జవాబు ఇచ్చింది. శ్రీలంక ఓపెనర్ నిసాంక ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 147 బంతులు ఎదుర్కొని 137 రన్స్ చేశాడు.
ఇందులో 11 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. ఇక గత కొంత కాలంగా శ్రీలంక జట్టుకు కీలక ఆటగాడిగా మారిన కుశాల్ మెండీస్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్
ఆడాడు. 8 ఫోర్లతో 87 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
దీంతో ఐదు మ్యాచ్ ల వన్డే సీరీస్ లో శ్రీలంక 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Also Read : కుండపోత వర్షం టి20 సీరీస్ సమం