Rishabh Pant : స‌రైన దారిలో వెళుతున్నాం – పంత్

ఆట అన్నాక త‌ప్పులు జ‌రుగుతాయి

Rishabh Pant : భార‌త క్రికెట్ జ‌ట్టు తాత్కాలిక కెప్టెన్ రిష‌బ్ పంత్(Rishabh Pant) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికా తో జ‌రిగిన ఐదు మ్యాచ్ ల సీరీస్ ముగిసింది. వ‌ర్షం కార‌ణంగా సీరీస్ విజేత ఎవ‌రో నిర్ణ‌యించే కీల‌క‌మైన ఐదో మ్యాచ్ ర‌ద్ద‌యింది.

దీంతో ఇరు జ‌ట్లు 2 మ్యాచ్ లు గెలిచి చెరి స‌మానంగా నిలిచాయి. బెంగ‌ళూర్ లో రిష‌బ్ పంత్ మీడియాతో మాట్లాడారు. ఆట అన్నాక త‌ప్పులు జ‌ర‌గ‌డం స‌హ‌జమేన‌ని పేర్కొన్నాడు.

ఇదే స‌మ‌యంలో వాటిని గుర్తించి ముందుకు వెళుతున్నామ‌ని, ప్ర‌స్తుతం తాము గెలుపు దారిలో కొన‌సాగుతున్నామ‌ని చెప్పాడు. జ‌ట్టు ప‌రంగా అంద‌రూ బాగా రాణించార‌ని కితాబు ఇచ్చాడు.

ఇషాన్ కిష‌న్, రుతురాజ్ గైక్వాడ్ , దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా తో పాటు బౌలింగ్ లో ఆవేష్ ఖాన్ , యుజ్వేంద్ర చాహ‌ల్, భువ‌నేశ్వ‌ర్ కుమార్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడార‌ని ప్ర‌శంసించారు.

ఏ ఆటగాడైనా లేదా ఏ జ‌ట్టు అయినా విజ‌యం సాధించాల‌నే ముందుకు సాగుతుంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో త‌మ టీమ్ అద్భుత‌మైన పోరాట ప‌టిమ‌ను ప్ర‌ద‌ర్శించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు రిష‌బ్ పంత్(Rishabh Pant).

విచిత్రం ఏమిటంటే ఒకేసారి ఐదుసార్లు నేను టాస్ లు కోల్పోయాను. ఇది ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేదన్నాడు. నా ప‌ర్ ఫార్మెన్స్ పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

దానిని నేను గుర్తించ‌గ‌ల‌ను. కానీ ఆట ప‌రంగా 100 శాతం రిజ‌ల్ట్ ఇవ్వాల‌నే తాను ప్ర‌య‌త్నం చేశాన‌ని కానీ స‌క్సెస్ అనేది మ‌న చేతుల్లో ఉండ‌ద‌న్నాడు.

Also Read : వ‌న్డే చ‌రిత్ర‌లో ఇంగ్లాండ్ రికార్డ్ స్కోర్

Leave A Reply

Your Email Id will not be published!