Air India Big Deal : బిగ్ డీల్ పై ఎయిర్ ఇండియా ఫోకస్
300 నారో బాడీ జెట్ ల కొనుగోలు
Air India Big Deal : ఎయిర్ ఇండియాను(Air India Big Deal) కొనుగోలు చేసిన టాటా గ్రూపు సంస్థ దానిని బలోపేతం చేసే పనిలో పడ్డంది. ఇప్పటికే సిఇఓ, చైర్మన్ ను నియమించింది. అందులో పని చేస్తున్న వారికి వీఆర్ఎస్ సదుపాయం కల్పించింది.
ఇంకో వైపు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం, ఎయిర్ ఇండియాను వరల్డ్ లోనే అత్యున్నతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు టాటా సంస్థల చైర్మన్ రతన్ టాటా. ఆయన తండ్రి జేఆర్డీ టాటా కలల పంట ఎయిర్ ఇండియా.
దానిని భారత ప్రభుత్వం తీసుకుంది. కానీ నడపలేక పోయింది. ఇటీవల తిరిగి టాటా చేతుల్లోకి వెళ్లింది ఎయిర్ ఇండియా. భారీ ధరకు కొనుగోలు చేశారు టాటా.
తాజాగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్ ఇండియా సంస్థ(Air India Big Deal) అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ డీల్స్ లో ఒక దానిని సిద్దం చేసింది. ఈ మేరకు 300 నారో బాడీ జెట్ లను ఆర్డర్ చేయడాన్ని పరిశీలిస్తోంది.
వాణిజ్య విమానయాన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్ లలో ఇది ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కొత్త యాజమాన్యం కింద తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది.
737 మ్యాక్స్ -10 జెట్ లు 300 కు పైగా కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తోంది. ఒక్కో డీల్ $40.5 బిలియన్ల కంటే విలువైనదిగా ఉందని అంచనా. నారో బాడీ ఆర్డర్ ను గెల్చుకుంటే బిగ్ సంస్థగా భారత దేశంలో నిలుస్తుంది.
700 కంటే ఎక్కువ ఆర్డర్లు చేస్తోంది. విస్తారా, గో ఎయిర్ లైన్స్ , ఇండియా లిమిటెడ్ , ఎయిర్ ఏషియా ఇండియా లిమిటెడ్ సహా ఇతర సంస్థలు విమానాలు నడుపుతున్నాయి.
Also Read : సోషల్ మీడియాపై కేంద్రం నజర్