T20 Rankings : టి20 ర్యాంకింగ్స్ లో దినేష్..చాహల్
సఫారీతో పర్ ఫార్మెన్స్ 87 వ ర్యాంకు
T20 Rankings : భారత వెటరన్ క్రికెటర్, ఫినిషర్ దినేష్ కార్తీక్ మెరుగైన ఆట తీరుతో ఐసీసీ ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్(T20 Rankings) లో మెరుగైన ర్యాంక్ పొందాడు. 108 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంకు సాధించాడు.
ఇక భారత జట్టుకు సంబంధించి ఓపెనర్ ఇషాన్ కిషన్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో ఉన్న ఏకైక బ్యాటర్ కావడం విశేషం. 41సగటుతో 206 పరుగులతో అత్యధిక రన్ స్కోరర్ గా నిలిచాడు.
ఆరో స్థానానికి చేర్చింది. టీమిండియా ఆస్ట్రేలియాను దాటేసింది టీమిండియా. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతున్నాడు.
బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ టి20 ర్యాంకింగ్స్(T20 Rankings) లో అతి పెద్ద మూవర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా సీరీస్ లో ఆరు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ మూడు స్థానాలు ఎగబాకి 23వ ప్లేస్ కు చేరుకున్నాడు.
ఇక జోష్ హేజిల్ వుడ్ టాప్ ర్యాంక్ టి20 బౌలర్ గా తన స్థానాన్ని కొనసాగించాడు. ఇక ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ , శ్రీలంక వనిందు హసరంగా ఇద్దరూ టాప్ 10లో నిలిచారు.
ఇక రవీంద్ర జడేజా 385 రేటింగ్ పాయింట్లతో టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్ లో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ 742 పాయింట్లు , రవి చంద్రన్ అశ్విన్ 850 పాయింట్లు, పేస్ స్పియర్ హెడ్ జస్పీత్ బుమ్రా 830 పాయింట్లు సాధించారు. వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు.
టెస్టు బౌలర్ల జాబితాలో 901 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Read : రవిశాస్త్రిపై పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్