Delhi LT Governor : ఢిల్లీ సీఎంఓ డిప్యూటీ సెక్రటరీ సస్పెండ్
మరో ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు..ఇంజనీర్ల పై వేటు
Delhi LT Governor : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోలుకోలేని షాక్ తగిలింది. సీఎంఓలో పని చేస్తున్న డిప్యూటీ సెక్రటరీ ప్రకాష్ చంద్ర ఠాకూర్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో సీరియస్ అయ్యారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.
ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేశారు. ప్రకాశ్ చంద్రతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులపై కూడా వేటు వేశారు లెఫ్టినెంట్ గవర్నర్. వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆదేశించారు.
సస్పెండ్ అయిన వారిలోఇద్దరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) లు ఉన్నారు. సెక్రటరీతో పాటు ఎస్డీఎంలను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు.
వసంత్ విహార్ ఎస్డీఎం హర్షిత్ జైన్ , వివేక్ విహార్ ఎస్డీఎం దేవేందర్ శర్మలను సస్పెండ్ చేశారు. అంతే కాకుండా కల్కాజీ ఎక్స్ టెన్షన్ లోని ఈడబ్ల్యూఎస్ ప్లాట్ ల నిర్మాణంలో లోపాలను గుర్తించిన ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డీడీఏ)కి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సస్పెండ్ చేశారు.
ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో శాంతి భద్రతలు, క్రైమ్ డేటా విశ్లేషణ, నివారణ చర్యలు, ప్రధాన సవాళ్లు, సంస్కరణలు లేదా చొరవలు , తదితర అంశాలపై సమావేశం చేపట్టారు.
లెఫ్టినెంట్ గవర్నర్ కు ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివరించారు. పబ్లిక్ ఔట్రీచ్ , కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యత గురించి తెలిపారు. ఇదే సమయంలో పోలీసు సిబ్బందికి వారి సాఫ్ట్ స్కిల్స్ ను మెరుగు పరిచేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు.
Also Read : ఇద్దరూ ఇద్దరే తలపండిన ఉద్దండులే