KTR Foxconn Chairman : కేటీఆర్ తో ఫాక్స్ కాన్ చైర్మ‌న్ భేటీ

తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు స్వాగ‌తం

KTR Foxconn Chairman : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన పేరొందిన ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మ‌న్ మిస్ట‌ర్ యంగ్ లియుతో పాటు బృందం గురువారం హైద‌రాబాద్ లో మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యింది. ఈ కీల‌క స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల‌, ఐటీ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ కూడా పాల్గొన్నారు.

ప్ర‌ధానంగా రాష్ట్రంలో హైద‌రాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో వివ‌రించారు మంత్రి. ఇదే స‌మ‌యంలో ఈవీలు, డిజిట‌ల్ ఆరోగ్యం, ఎల‌క్ట్రానిక్స్ , రోబోటిక్స్ , త‌దిత‌ర ప్ర‌ధాన అంశాల గురించి చ‌ర్చ‌రించారు.

తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని కోరారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ ప్ర‌భుత్వం టీఎస్ఐఎస్ పాల‌సీని తీసుకు వ‌చ్చింద‌న్నారు. దీని వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులంటూ పెట్టుబ‌డిదారుల‌కు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపే ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు కేటీఆర్. వ‌ర‌ల్డ్ వైడ్ గా టాప్ మోస్ట్ కంపెనీలు హైద‌రాబాద్ లో కొలువు తీరాయ‌ని, ఇదే స‌మ‌యంలో ఫాక్స్ కాన్ కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేయాల‌ని సూచించారు.

ప్ర‌భుత్వం మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌న్నారు.

ఐటీ హ‌బ్ , వీ హ‌బ్, అగ్రి హ‌బ్ , ఫార్మా హ‌బ్ ల‌కు కేంద్రంగా మారింద‌న్నారు. దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇక్క‌డే కొలువు తీర‌డం త‌మ ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్(KTR Foxconn Chairman).

ప్ర‌స్తుతం మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఆయా కంపెనీల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు స‌హ‌కారం , తోడ్పాటు అంద‌జేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

దీనిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. అన్ని రంగాల‌లో హైద‌రాబాద్ సాధించిన అభివృద్ధిని చూసి ఫాక్స్ కాన్ చైర్మ‌న్ మిస్ట‌ర్ యంగ్ లియు(KTR Foxconn Chairman) అభినందించారు.

Also Read : అపాచీ ప‌రిశ్ర‌మ‌తో 10 వేల మందికి ఉపాధి

 

https://twitter.com/KTRTRS/status/1539952004407078913/photo/1

https://twitter.com/KTRTRS/status/1539952004407078913/photo/1

Leave A Reply

Your Email Id will not be published!