Ketaki Chitale : జై హింద్ జై మహారాష్ట్ర – కేత‌కి చితాలే

ప‌వార్ పై కామెంట్స్ ..జైలు నుంచి విడుద‌ల‌

Ketaki Chitale : మాజీ కేంద్ర మంత్రి, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొని జైలుకు వెళ్లిన న‌టి కేత‌కి చితాలే ఇవాళ బెయిల్ పై విడుద‌ల‌య్యారు.

ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం కేత‌కి చితాలే మీడియాతో మాట్లాడారు. సంచ‌ల‌న కామెంట్స్ చేశారు కేత‌కి చితాలే(Ketaki Chitale). స‌రైన స‌మ‌యంలో తాను స్పందిస్తాన‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఫేస్ బుక్ పోస్ట్ కు సంబంధించి 29 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఈ న‌టిపై ఇప్ప‌టికి 20 కి పైగా కేసులు ఎదుర్కొంటున్నారు. ఎన్సీప చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ పై అభ్యంత‌క‌ర‌మైన పోస్ట్ ను షేర్ చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై కేత‌కి చితాలేపై కేసు న‌మోదు చేశారు.

ఈ మేర‌కు ఆమెను అరెస్ట్ చేశారు.కేత‌కి చితాలే కు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేశారు. శుక్ర‌వారం కేత‌కి చితాలే థానే జైలు నుండి వాకౌట్ చేశారు.

జిల్లా న్యాయ‌మూర్తి హెచ్ ఎం ప‌ట్వ‌ర్ద‌న్ కేత‌కి చితాలే రూ. 20,000 పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేశారు. శ‌రద్ ప‌వార్ ను అవ‌మాన ప‌రిచే రీతిలో మ‌రాఠీ ప‌ద్యాన్ని పంచుకున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై గ‌త నెల మే 14న చితాలేను అరెస్ట్ చేశారు.

జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కేత‌కి చితాలే మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పుడేమీ మాట్లాడ లేన‌ని, స‌రైన స‌మ‌యంలో మాట్లాడ‌తాన‌ని చెప్పారు.

చాలా ప్ర‌శ్న‌ల‌కు జై హింద్ జై మ‌హారాష్ట్ర అంటూ స‌మాధానం ఇస్తూ వెళ్లి పోయింది కేత‌కి చితాలే. అంతే కాదు ఆమె విజ‌య చిహ్నాన్ని కూడా చూపించారు. ప్ర‌స్తుతం కేత‌కి చితాలే(Ketaki Chitale) సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.

Also Read : రెబ‌ల్స్ కు 70 రూమ్ లు రోజుకు రూ. 8 ల‌క్ష‌లు

Leave A Reply

Your Email Id will not be published!