IND vs IRE T20 Series 2022 : భారత్ ఐర్లాండ్ టూర్ షెడ్యూల్
ఆతిథ్య జట్టుతో రెండు టీ20 మ్యాచ్ ల సీరీస్
IND vs IRE T20 Series 2022 : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గతంలో ఎన్నడూ లేనంతగా ప్రయోగాలు చేస్తోంది క్రికెట్ లో. ఇప్పటి వరకు ఏకంగా ఆరుగురు ఆటగాళ్లను మార్చేసింది సారథ్య బాధ్యతల నుంచి. త్వరలోనే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరగనుంది.
అందుకే ఈ ప్రయోగం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంతే కాదు ఆసిస్ కు వెళ్లే జట్టును ఎంపిక చేసే బాధ్యత సెలెక్షన్ కమిటీ చైర్మన్
చేతన్ శర్మతో పాటు ఈసారి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కూడా ఉంటుందని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం రెండు జట్లు భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఒక జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తుండగా మరో జట్టుకు ఇటీవలే భారత్ లో జరిగిన ఐపీఎల్ 2022 విజేతగా నిలిపిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు.
సీనియర్ల జట్టు ఇంగ్లాండ్ లో ఓ టెస్టు, వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్ లో పర్యటించనుంది.
ఇప్పటికే బయలు దేరింది.
ఆతిథ్య జట్టుతో రెండు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. ఇక ఈ జట్టును వరల్డ్ కప్ కు రిహార్సల్ గా చూడనుంది. ఇప్పటికే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ
చైర్మన్ చేతన్ శర్మ ఐర్లాండ్ కు బయలు దేరాడు.
మ్యాచ్ లలో భాగంగా మొదటి టి20 మ్యాచ్(IND vs IRE T20 Series 2022) ఈనెల 26న ఆదివారం డబ్లిన్ లోని ది విలేజ్ లో జరుగుతుంది.
ఇక రెండో టి20 మ్యాచ్ 28న ఇదే మైదానంలో జరుగుతుంది.
ఇక టీమిండియా పరంగా చూస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాగా భువీ వైస్ కెప్టెన్ . సంజూ శాంసన్, రుతురాజ్ , ఇషాన్ , సూర్య కుమార్ , రాహుల్
త్రిపాఠి, దీపక్ హూడా, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్ , దినేష్ కార్తీక్ , ఆవేష్ ఖాన్ , హర్షల్ పటేల్ , ఉమ్రాన్ మాలిక్ , అర్ష దీప్ , యుజ్వేంద్ర
చాహల్ , రవి బిష్ణోయ్ ఉన్నారు.
ఇక ఐర్లాండ్ పరంగా చూస్తే ఆండ్రూ బల్బిర్నీ కెప్టెన్ , హ్యారీ, గరేత్ డిలనీ, పాల్ స్టీరింగ్ , కాంఫర్ , డోహ్నీ, లోర్కాన్ , మార్క్ , జార్జ్ , జాషువా లిటిల్ ,
ఆండీ మెక్ బ్రిన్ , బ్యారీ మెకార్టీ, కాన్ ఆల్బర్ట్ , క్రెయిగ్ యంగ్ ఆడతారు.
Also Read : భారత్ భళా శ్రీలంక డీలా