Ramiz Raja Ganguly : రమీజ్ రజా షాకింగ్ కామెంట్స్
గంగూలీ రమ్మని పిలిచినా వెళ్లలేదు
Ramiz Raja Ganguly : పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా(Ramiz Raja Ganguly) షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డు (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ కు సంబంధించి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు రమ్మని ఆహ్వానించాడని తెలిపాడు. గత ఏడాది 2021లో దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ తో పాటు ఈ ఏడాది 2022 ఐపీఎల్ ఫైనల్ జరిగిన గుజరాత్ అహ్మదాబాద్ కు రమ్మని కోరాడని చెప్పాడు.
శనివారం పాకిస్తాన్ మీడియాతో మాట్లాడారు. సౌరవ్ గంగూలీ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నాడు. అయితే కొన్ని కారణాల రీత్యా వెళ్లలేక పోయానని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా ఐపీఎల్ మీడియా రైట్స్ రూ. 48, 390 కోట్లకు అమ్ముడు పోయిన విషయాన్ని ప్రస్తావించగా పై విధంగా స్పందించాడు రమీజ్ రజా(Ramiz Raja Ganguly). గంగూలీ ఆహ్వానం పై చాలా సార్లు ఆలోచించానని అన్నాడు.
ఒక వేళ గనుక తాను ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు వెళ్లి ఉంటే పాకిస్తాన్ అభిమానులు తనపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉండేవారని అభిప్రాయ పడ్డాడు రమీజ్ రజా.
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సత్ సంబంధాలు లేక పోవడం వల్ల తాను ఆ సాహసం చేయలేక పోయానని చెప్పాడు. ఆట పరంగా అయితే తాను వెళ్లాల్సి ఉందని కానీ పరిస్థితులు తనను వెళ్ల నీయకుండా చేశాయని తెలిపాడు పీసీబీ చైర్మన్.
ఇదే సమయంలో పీసీబీ ప్రతిపాదించిన నాలుగు దేశాల టీ20 సీరీస్ కు ఐసీసీ పర్మిషన్ ఇవ్వక పోవడాన్ని తప్పు పట్టాడు. ఈ విషయంపై గంగూలీతో చర్చించానని తెలిపాడు. త్వరలో సానుకూల ప్రకటన రానుందని తెలిపాడు.
Also Read : 1983 వరల్డ్ కప్ సాధించి 36 ఏళ్లు