SYL Sidhu Song : యూట్యూబ్ నుంచి సిద్దూ సాంగ్ తొలగింపు

చివ‌రగా నీటి స‌మ‌స్య‌పై పాడిన పాట

SYL Sidhu Song : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన ప్ర‌ముఖ పంజాబ్ సింగ‌ర్ సిద్దూ మూసే వాలా ఆఖ‌రుగా పాడిన ఎస్ వై ఎల్ పాట‌(SYL Sidhu Song) ను యూట్యూబ్ తొల‌గించింది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన నీటి స‌మ‌స్య గురించి ఇందులో ఉంది.

స‌ట్లేజ్, య‌మునా లింక్ గురించి కూడా ప్ర‌స్తావించాడు సిద్దూ మూసేవాలా. చాలా కాలంగా పంజాబ్, హ‌ర్యానా రాష్ట్రాల మ‌ద్య అస‌మ్మ‌తికి కార‌ణ‌మైంది.

గ‌త నెల మే 29న కాల్చి చంప‌డానికి ముందు ఈ ఎస్ వై ఎల్ పాట‌ను సిద్దూ మూసే వాలా స్వంతంగా స్వ‌ర ప‌రిచాడు. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి యూట్యూబ్ తీసివేసింది.

సిద్దూ కంపోజ్ చేసిన మ్యూజిక్ వీడియోను నిర్మాత ఎంఎక్స్ ఆర్సీఐ ఈనెల 23న యూట్యూబ్ లో విడుద‌ల చేశారు. ఈ వీడియోను క్లిక్ చేసిన వారికి అది క‌నిపించ‌డం లేదు.

ప్ర‌భుత్వం నుండి చ‌ట్ట ప‌ర‌మైన ఫిర్యాదు మేర‌కు ఈ కంటెంట్ ఈ దేశం డొమైన్ లో అందుబాటులో లేదంటూ యూట్యూబ్ స్ప‌ష్టం చేసింది. సిద్దూ మూసే వాలా త‌యారు చేసిన ఈ పాట అవిభ‌క్త , 1984 సిక్కు వ్య‌తిరేక అల్ల‌ర్ల గురించి ప్ర‌స్తావిస్తుంది.

రైతుల ఆందోళ‌న స‌మ‌యంలో ఎర్ర‌కోట‌పై సిక్కు జెండాను ఎగుర వేసిన‌ట్లు స‌న్నివేశాలు వీడియోలో ఉన్నాయి. అప్ లోడ్ చేసిన వెంట‌నే ఈ పాట కు యూట్యూబ్ లో 27 మిలియ‌న్ల‌కు పైగా వీక్ష‌ణ‌ల‌ను సంపాదించింది. 3.3 మిలియ‌న్ లైక్ లు పొందింది.

ప్ర‌స్తుతం సిద్దూ సాంగ్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ప్రియాంక ‘హోమ్‌వేర్’ ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!