Eknath Shinde : శివసేన లోనే ఉన్నాం సత్తా చాటుతాం
స్పష్టం చేసిన ఏక్ నాథ్ షిండే
Eknath Shinde : శివసేన తిరుగుబాటు నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) సంచలన కామెంట్స్ చేశారు. తాము శివసేన పార్టీలోనే ఉన్నామని తామేమిటో, తమ సత్తా ఏమిటో చాటు తామన్నారు.
మంగళవారం షిండే మీడియాతో మాట్లాడారు. అస్సాంలోని గౌహతి రాడిసన్ హోటల్ లో రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నారు. తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.
త్వరలో తామంతా ముంబైకి వెళతానని వెల్లడించారు. తాము శివసేన పార్టీ నుంచి వేర్పాటు కాలేదన్నారు. శివసేనను ముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశంలోనే ఉన్నామని చెప్పారు.
ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు ఏక్ నాథ్ షిండే. తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా మరాఠా రాష్ట్ర గవర్నర్ కోషియార్ ను కలుస్తామన్నారు వెల్లడించారు.
ఇదిలా ఉండగా రెబల్ ఎమ్మెల్యేల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రేతో టచ్ లో ఉన్నారన్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు.
డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత వేటు నోటీసులకు సంబంధించి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు జూలై 12 వరకు గడువు ఇచ్చింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. డిప్యూటీ స్పీకర్ జడ్జి అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను తాము గవర్నర్ ముందు ఉంచుతామని తెలిపారు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde).
ఇదిలా ఉండగా మహారాష్ట్ర సంక్షోభం ఇంకా ముగియ లేదు. ఇదే సమయంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే భావోద్వేగంతో లేఖ రాశారు. గౌహతి నుండి రండి. కలిసి మాట్లాడుకుందామని కోరారు.
Also Read : నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి జుబైర్