Jasprit Bumrah : రోహిత్ స్థానంలో బుమ్రాకు కెప్టెన్సీగా చాన్స్

ఇంగ్లండ్ తో ఆడే టీమిండియా టెస్టుకు ఎంపిక‌

Jasprit Bumrah : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీ) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా కార‌ణంగా ఆట‌కు దూరంగా ఉన్న భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు బ‌దులు కెప్టెన్ గా జ‌స్ప్రీత్ బుమ్రాను(Jasprit Bumrah) నియ‌మించింది సెలెక్ష‌న్ క‌మిటీ.

జూలై 1 నుంచి 5వ తేదీ వ‌ర‌కు ఐదో టెస్ట్ ఆడ‌నుంది. గ‌త ఏడాది 2021లో ఐదు టెస్టుల సీరీస్ లో భాగంగా భార‌త్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. దుబాయిలో ఐపీఎల్ ఉండ‌డంతో భార‌త ఆట‌గాళ్లు ఐదో టెస్టు ఆడ‌కుండానే చెక్కేశారు.

దీనిపై పెద్ద రాద్దాంతం చెల‌రేగింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీంతో బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీ రంగంలోకి దిగాడు.

ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాడు. 2022లో ఇంగ్లండ్ టూర్ లో భాగంగా మిగిలి పోయిన 5వ టెస్టును ఆడ‌తామ‌ని హామీ ఇచ్చారు. భార‌త్ ఆడ‌క పోవ‌డం వ‌ల్ల త‌మ‌కు భారీ న‌ష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదు చేసింది.

దీంతో మిగిలి పోయిన ఆఖ‌రి టెస్టుతో పాటు భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌న్డేలు, టి20లు ఆడ‌నుంది. ఇదిలా ఉండ‌గా స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగిన టెస్టు సీరీస్ లో ఇంగ్లండ్ దుమ్ము రేపింది ఇంగ్లండ్ జ‌ట్టు.

జోరు మీదున్న ఆ జ‌ట్టును ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మేన‌ని ఇంగ్లండ్ మాజీ ఆట‌గాళ్లు. ఇదిలా ఉండ‌గా రోహిత్ తో పాటు కేఎల్ రాహుల్ కూడా దూరంగా ఉన్నాడు.

తాజాగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ గురువారం జ‌స్ ప్రీత్ బుమ్రా ను కెప్టెన్ గా, రిష‌బ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియ‌మించిన‌ట్లు ప్ర‌క‌టించారు.

 

Also Read : సంజూ శాంస‌న్ క్రేజ్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!