Reliance Pret : ప్రెట్ ఎ మ్యాంగర్ తో రిలయన్స్ ఒప్పందం
భారత దేశంలో శాండ్ విచ్ ..కాఫీ చైన్ ప్రారంభం
Reliance Pret : రిలయన్స గ్రూప్ సంస్థ రోజు రోజుకు అన్ని రంగాలలో విస్తరించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆయిల్, టెలికాం, ఫ్యాషన్స్, రిటైల్ , జ్యుయెలరీ.ఇలా ప్రతి దానిలో తనదైన పాత్ర ఉండేలా చూస్తోంది.
తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ. ఇందులో భాగంగా రిలయన్స్ జియో కంపెనీకి చైర్మన్ తన వారసుడు ఆకాష్ అంబానీకి అప్పగించారు.
ఇక తన ముద్దుల తనయ ఇషా అంబానీకి ఏకంగా ఇండియాలోనే అతి పెద్ద రిటైల్ కంపెనీగా పేరొందిన రిలయన్స్ రిటైల్ యూనిట్ కు చైర్ పర్సన్ గా చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖేష్ అంబానీ.
ప్రపంచంలోనే బ్రిటీష్ శాండ్ విచ్, కాఫీకి మంచి పేరుంది ప్రెట్ ఎ మ్యాంగర్(Reliance Pret). దానిని భారత దేశంలో ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్ లో భాగంగా ప్రెట్ ఎ మ్యాంగర్ తో ఫ్రాంచైజీ భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
ఈ మేరకు ఆ సంస్థతో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది రిలయన్స్ గ్రూప్. దేశంలోని ప్రధాన నగరాలలో బ్రిటీష్ శాండ్ విచ్ , కాఫీ చైన్ ప్రెట్ ఎ మ్యాంగర్ ను ప్రారంభిస్తుంది.
దీనికి పేరు కూడా పెట్టేసింది. ఇక నుంచి ఇండియాలో రిలయన్స్ బ్రిటన్ చైన్ ప్రెట్ ఎ మ్యాంగర్ గా ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (ఆర్బీఎల్ ) ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తుంది. 2023లోపు దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో మొదటి ప్రీట్ స్టోర్ ను ప్రారంభిస్తుంది.
Also Read : ఇషా అంబానీ చేతికి రిలయన్స్ రిటైల్