IND vs ENG 5th Test : పట్టు బిగించిన భారత్ రాణించిన పుజారా
దంచి కొట్టిన ఇంగ్లండ్ క్రికెటర్ బెయిర్ స్టో
IND vs ENG 5th Test : ఇంగ్లండ్ తో బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో భారత జట్టు పటిష్ట స్థితిలోకి చేరింది. ఇప్పటికే ఐదు టెస్టుల సీరీస్ లో భాగంగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది.
ఇంగ్లండ్ బ్యాటర్లను బౌలర్లు కట్టడి చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు 300 పరుగుల లోపై చాప చుట్టేసింది. దీంతో 132 పరుగుల ఆధిక్యం దక్కింది.
అనంతరం బరిలోకి దిగిన రెండో ఇన్నింగ్స్ లో ఆట ప్రారంభించిన భారత జట్టు(IND vs ENG 5th Test) చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) పుంజుకోవడం, హాఫ్ సెంచరీ చేయడంతో టీమిండియాకు 257 పరుగుల ఆధిక్యం లభించింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 45 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ మరోసారి నిరాశ పరిచాడు. 4 పరుగులకే చాప చుట్టేశాడు.
వన్ డౌన్ లో వచ్చిన హనుమ విహారది సేమ్ సీన్ 11 రన్స్ కు ఔట్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో 11 రన్స్ కే క్లీన్ బౌల్డ్ అయిన విరాట్ కోహ్లీ 20 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు.
ఓపెనర్ గా వచ్చిన ఛతేశ్వర్ పుజారా 139 బాల్స్ ఆడి 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో సత్తా చాటిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 30 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లు ఎంతగా శ్రమించినా ఫలితం లేక పోయింది.
Also Read : బౌలర్లు భళా ఇంగ్లండ్ విల విల