ED Raids Vivo : చైనా కంపెనీ వివోపై ఈడీ దాడులు
దేశంలోని 44 చోట్ల సోదాలు
ED Raids Vivo : ఇప్పటికే చైనాకు చెందిన రెడ్ మీ కంపెనీ అక్రమ లావాదేవీలు జరిపిందంటూ షాక్ ఇచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం మరో చైనీస్ కంపెనీ వీవోపై దాడి చేసింది.
దేశంలోని 44 చోట్ల ఏకకాలంలో ఈడీ దాడులు చేసింది. విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ చైనీస్ మొబైల్ ఫోన్ తాయారీదారు వివో(ED Raids Vivo), దానికి సంబంధించిన ఇతర సంస్థలపై దాడి చేసింది.
ఇదిలా ఉండగా వివో కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత ఏడాది డిసెంబర్ లో కేంద్ర ఆదాయ పన్ను శాఖ కూడా వివో, ఒప్పో, షావోమీ , ఒన్ ప్లస్ , తదితర చైనాకు చెందిన మొబైల్ సంస్థలకు చెందిన 20 చోట్ల సోదాలు చేపట్టింది.
ఇదిలా ఉండగా సదరు కంపెనీలు వందల కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తేలింది. వాస్తవంగా వచ్చిన దానికంటే తక్కువ ఆదాయాన్ని చూపించినట్లు గుర్తించింది ఈడీ.
ఇదే సమయంలో ఇన్ పుట్ ల ఆధారంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ లేదా ఫెమా ఫెమా ఉల్లంఘనపై షియోమీ ఇండియా హెడ్ మను జైన్ ను కేంద్ర ఏజెన్సీ ఈడీ ప్రశ్నించింది.
ఈ కేసుతో ఏకంగా ఈడీ రూ. 5,000 కోట్ల షియోమీ బ్యాంకు ఖాతాలను కూడా అటాచ్ చేసింది. దానిని కర్ణాటక హైకోర్టు నిలిపి వేసింది. ఈడీ తన అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు షియోమి ఆరోపించింది.
గత ఆగస్టులో కూడా చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న టెలికాం విక్రేత జీటీఈ దాని కార్పొరేట్ ఆఫీసులో సహా ఐదు ప్రాంగాణలలో సోదాలతో దాడి చేసింది.
Also Read : ట్విట్టర్ సిఇఓ సింప్లిసిటీకి ఫిదా