Shashi Tharoor : వైద్యుల ర‌క్ష‌ణ‌కు స‌మ‌గ్ర‌ చ‌ట్టం అవ‌స‌రం

మోదీ ప్ర‌భుత్వానికి ఎంపీ డిమాండ్

Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలోని వైద్యుల్లో 75 శాతం మంది ఏదో ఒక ర‌క‌మైన శారీరక వేధింపుల‌కు గుర‌వుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). ఇలాంటి కీల‌క‌మైన‌, అనుకోని ఘ‌ట‌న‌ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాలు బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని ఎంపీ పేర్కొన్నారు.

శ‌శి థ‌రూర్ హెల్త్ కేర్ (ఆరోగ్య రంగం) నిపుణుల‌పై హింస‌పై చ‌ట్టాన్ని తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. వైద్యుల‌కు శారీర‌క వేధింపుల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం బిల్లును ప్ర‌వేశ పెట్టింద‌ని శ‌శి థ‌రూర్ వెల్ల‌డించారు.

అయితే ఆరోగ్య సంర‌క్ష‌ణ నిపుణులపై జ‌రుగుతున్న హింస‌కు చెక్ పెట్టేందుకు స‌మ‌గ్ర చ‌ట్టాన్ని తీసుకు రావాల‌ని డిమాండ్ చేశారు ఎంపీ.

ఇప్పుడు తీసుకు వ‌చ్చిన చ‌ట్టం ఎందుకు ప‌నికి రావడం లేద‌న్నారు. మొత్తం వైద్యుల్లో 75 శాతం మంది ఏదో ఒక ర‌క‌మైన శారీర‌క వేధింపుల‌కు గుర‌వుతున్నార‌ని పేర్కొన్నారు ఎంపీ. ప్ర‌స్తుతం తీసుకు వ‌చ్చిన చ‌ట్టాలు అత్యంత బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని ఆరోపించారు.

ఆరోగ్య నిపుణుల‌పై హింస‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌భుత్వం 2019లో పార్ల‌మెంట్ లో బిల్లును ప్ర‌వేశ పెట్టింద‌న్నారు. అయితే త‌ర్వాత దానిని ఉపసంహ‌రించు కున్నార‌ని శ‌శి థ‌రూర్ పేర్కొన్నారు.

మ‌రో వైపు బీజేపీ స‌భ్యుడు నిషికాంత్ దూబే జార్ఖండ్ లోని త‌న గొడ్డా నియోజ‌క‌వ‌ర్గంలో జాతీయ పౌర రిజిస్ట‌ర్ చొర‌వ‌ను అమ‌లు చేయాల‌ని కోరారు. ఇక్క‌డ సంతాల్ క‌మ్యూనిటీకి చెందిన వారి జ‌నాభా క్షీణించింద‌న్నారు.

Also Read : రాహుల్ సారీ చెప్పాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!