Irrfan Khan : అద్భుత న‌టుడు అరుదైన మాన‌వుడు

విలక్ష‌ణ న‌టుడికి విన‌మ్ర నివాళి

Irrfan Khan  : ఇవాళ ఇర్ఫాన్ ఖాన్ జ‌యంతి. బ‌తికింది కొద్ది కాలమే. కానీ సినీ వెండి తెర మీద త‌న‌కంటూ ఓ పేజీని త‌యారు చేసుకున్నారు ఖాన్ సాహిబ్. స‌రిగ్గా ఇదే రోజు 1967 జ‌న‌వ‌రి 7న పుట్టారు.

ఇర్ఫాన్ ఖాన్ హిందీలోనే కాదు బ్రిటీష్, అమెరిక‌న్ చిత్రాల‌లో కూడా ప‌ని చేశారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర న‌టుల్లో ఇర్ఫాన్ ఖాన్ అత్యుత్త‌మ న‌టుడిగా పేరొందారు. 30 ఏళ్ల పాటు సినీ జ‌గ‌త్తులో విహ‌రించారు.

జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలలో త‌న‌ను తాను న‌టుడిగా ప్రూవ్ చేసుకున్నారు. 2011లో ప‌ద్మ‌శ్రీ కూడా ఆయ‌న‌ను వ‌రించింది. ఇర్ఫాన్ ఖాన్(Irrfan Khan )మ‌రణించాక ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పుర‌స్కారాన్ని అందించింది.

ఇర్ఫాన్ ఖాన్ స‌లామ్ బాంబేలో చిన్న పాత్ర ద్వారా సినీ రంగంలోకి ఎంట‌ర్ అయ్యాడు 1988లో. 2001లో బ్రిటీష్ మూవీ ది వారియ‌ర్ లో న‌టించాక మ‌రి కొన్ని సినిమాల‌లో ప‌ని చేసే చాన్స్ ల‌భించింది.

2003లో హాసిల్, 2004లో మ‌క్బూల్ నాట‌కాల‌లో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఇందుకు గాను ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డుకు ఎంపిక‌య్యాడు.

లైఫ్ ఇన్ ఏ మెట్రో , పాన్ సింగ్ తోమ‌ర్ ల‌లో న‌టించినందుకు ఉత్త‌మ న‌టుడిగా జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డు గెలుపొందాడు. ఇర్ఫాన్ ఖాన్ 2010లో న‌టించిన లంచ్ బాక్స్ న‌ట‌న‌కు ఎన్నో ప్ర‌శంస‌లు ల‌భించాయి.

2015లో పికు, 2015లో తల్వార్ మ‌రింత పేరు తెచ్చింది. 2012 లో హాలీవుడ్ మూవీ ది అమేజింగ్ స్పైడ‌ర్ మ్యాన్ , లైఫ్ ఆఫ్ పై , 2015లో జురాసిక్ వ‌ర‌ల్డ్ , 2016లో ఇన్ఫెర్నో లో న‌టించి మెప్పించాడు.

2008లో స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ , న్యూయార్క్ , హైద‌ర్ ,గుండే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆయ‌న చివ‌రి చిత్రం ఆంగ్రేజీ మీడియం 2020లో వ‌చ్చింది.

2017 నాటికి ఇర్ఫాన్ ఖాన్ (Irrfan Khan )సినిమాలు బాక్సాఫీసు వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్లు సాధించాయి. 2018లో ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. 2020 ఏప్రిల్ 19న ఇక సెల‌వంటూ వెళ్లి పోయాడు.

ది గార్డియ‌న్ కు చెందిన పీట‌ర్ బ్రాడ్ షా ఇర్ఫాన్ ఖాన్ మ‌ర‌ణంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. హిందీ, ఆంగ్ల భాషా చిత్రాల‌లో విశిష్ట‌మైన , ఆక‌ర్ష‌ణీయ‌మైన న‌టుడిగా ఉన్నారు.

చివ‌రి దాకా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే త‌త్వం ఎప్ప‌టికీ నిలిచి ఉంటుంద‌న్నాడు. గొప్ప న‌టుడినే కాదు అంత‌కంటే అరుదైన మాన‌వుడిని కోల్పోయింది ఈ దేశం.

Also Read : క్రికెట్ దిగ్గ‌జం దేశం సలాం

Leave A Reply

Your Email Id will not be published!