Sonali Bendre Viral : సానుకూల దృక్ఫ‌థం ఆరోగ్యానికి మార్గం

స్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టి సోనాలీ బింద్రే

Sonali Bendre Viral : క్యాన్స‌ర్ బారిన ప‌డి చావును జ‌యించిన ప్ర‌ముఖ న‌టి సోనాలీ బెంద్రే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఓ రియాల్టీ షోకు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాను ఆరోగ్యంగా ఉండేందుకు ప్ర‌ధాన కార‌ణం ఒక్క‌టేన‌ని , అది ఆరోగ్య‌క‌ర‌మైన జీవన శైలి, విధానం మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు సోనాలీ బింద్రే(Sonali Bendre Viral). పిల్ల‌ల‌ను పెంచే విష‌యంలో పేరెంట్స్ ఎన్ని ఇబ్బందులు ప‌డ‌తారో, వాళ్లు త‌మ‌ను తాము ఎలా కోల్పోతారో అంత‌కంటే ఈ క్యాన్స‌ర్ వ్యాధి గొప్ప‌ది కాద‌న్నారు న‌టి.

తాను వ్య‌తిరేకంగా ఎప్పుడూ ఆలోచించ‌న‌ని, కేవ‌లం సానుకూల దృక్ఫ‌థంతో మాత్ర‌మే ఆలోచిస్తాన‌ని ఇదే త‌న మెరుగైన ఆరోగ్యానికి, ఆనందంగా ఉండేందుకు దోహ‌దం చేస్తుంద‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇదే స‌మ‌యంలో తాను ప్ర‌జ‌ల‌కు స్పూర్తిగా మారాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. ఒక‌వేళ తాను ప్రేర‌ణ‌గా నిలుస్తున్నానంటే అది వారి గొప్ప‌త‌నం త‌ప్ప త‌న‌ది కాద‌న్నారు సోనాలీ బింద్రే(Sonali Bendre).

ఆమెకు 2018లో మెటాస్టాటిక్ క్యాన్స‌ర్ వ్యాధికి గురైంది. అమెరికాలో చికిత్స తీసుకుంది. ఆమెతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ లో మరో న‌టి మ‌నీషా కోయిరాలా కూడా ఇదే వ్యాధికి గురైంది. మ‌రో వైపు ప్ర‌ముఖ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ కూడా క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు. ఆ త‌ర్వాత కోలుకున్నాడు. తిరిగి ఆట‌లోకి వ‌చ్చాడు. కానీ అనుకోకుండా త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఏది ఏమైనా సోనాలీ చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : సుదీప్ మ‌ద్ద‌తుపై ప్ర‌కాష్ రాజ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!