CJI DY Chandrachud : సీజేఐ చంద్రచూడ్ కు అరుదైన గౌరవం
హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ అవార్డు
CJI DY Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు అరుదైన గౌరవం లభించింది. ఆయన తండ్రి కూడా సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా పని చేశారు. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థకు 50వ సీజేఐగా కొలువు తీరారు జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. అత్యున్నత పదవిలో ఉన్నా అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు సీజేఐ.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సెమినార్లలో పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి కీలక పత్రాలను జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సమర్పించారు. ఇదే సమయంలో ఆయన వివిధ సమయాలలో న్యాయమూర్తిగా వెలువరించిన తీర్పులు సంచలనం సృష్టించాయి. ఒక రకంగా చెప్పాలంటే దేశానికి పాఠాలుగా మారాయి.
ఇదిలా ఉండగా జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ కు(CJI DY Chandrachud) ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. అమెరికా లోని హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ నకు సీజేఐని ఎంపిక చేసింది. ఈ మేరకు యూనివర్శిటీ కీలక ప్రకటన చేసింది.
కాగా దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా న్యాయవాద వృత్తికి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ వెల్లడించింది. ఈనెల 11న ఆన్ లైన్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును సీజేఐ డీవై చంద్రచూడ్ కు అందజేస్తారు.
ఈ ఈవెంట్ లో హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ ప్రొఫెసర్ డేవిడ్ విల్కిన్స్ పాల్గొంటారు. ఈ సందర్భంగా సీజేఐ ధనంజయ వై చంద్ర చూడ్ తో మాట్లాడతారు.
Also Read : జన హితం పాదయాత్ర లక్ష్యం