Surendran Patel : ఒక‌ప్పుడు కూలీ నేడు యుఎస్ జ‌డ్జి

టెక్సాస్ లో జ‌డ్జీగా సురేంద్ర‌న్ ప్ర‌మాణం

Surendran Patel : ఎవ‌రీ సురేంద్ర‌న్ కె ప‌టేల్ అనుకుంటున్నారా. ప్ర‌వాస భార‌తీయుడు. ఒక‌ప్పుడు కూటి కోసం కూలీ ప‌ని చేశాడు. బీడీలు కూడా చుట్టాడు. కానీ క‌ష్ట‌ప‌డి ఏకంగా అమెరికాలోని టెక్సాస్ న‌గ‌రానికి న్యాయ‌మూర్తిగా ఎంపిక‌య్యాడు. ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశాడు. ఈ సంద‌ర్భంగా సురేంద్ర‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌పంచంలో ఎవ‌రైనా ఎక్క‌డి నుంచైనా అనుకుంటే సాధించ లేనిది ఏదీ లేద‌ని పేర్కొన్నారు. కావాల్సింద‌ల్లా ప‌ట్టుద‌ల ఒక్క‌టేన‌ని స్ప‌ష్టం చేశారు సురేంద్ర‌న్. ఒక‌ప్పుడు డ్రాప‌వుట్ గా ఉన్నారు. కేర‌ళ లోని కాస‌ర‌గోడ్ లో పుట్టారు. చ‌దువు మానేసి జీవ‌నోపాధి కోసం రోజూ వారీ కూలీ ప‌ని చేశాడు.

బ‌తుకు దెరువు కోసం హోట‌ల్ లో హౌస్ కీప‌ర్ గా ప‌ని చేశాడు. అలా ప‌ని చేసుకుంటూనే చ‌దువుపై ఫోక‌స్ పెట్టాడు. లా డిగ్రీ చ‌దివాడు. ఆయ‌న‌కు ఇప్పుడు 51 ఏళ్లు. తాను బీడీలు చుట్ట‌డం, హౌస్ కీప‌ర్ గా ప‌ని చేయ‌డం త‌న‌కు యుఎస్ఏలో విజ‌యం సాధించేందుకు దోహ‌ద ప‌డేలా చేసింద‌న్నారు సురేంద్ర‌న్ కె ప‌టేల్. 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చదివా. నా కుటుంబాన్ని పోషించేందుకు ఆర్థిక స్తోమ‌త లేదు.

రోజూ వారీ కూలీగా ఏడాది పాటు ప‌ని చేశా. అదే న‌న్ను మార్చింద‌న్నారు సురేంద్ర‌న్ కె ప‌టేల్(Surendran Patel). ఎల్ఎల్బీ పూర్తి చేశాక యుఎస్ లో జీవించేందుకు స‌హాయ ప‌డింద‌ని చెప్పారు. నేను టెక్సాస్ లో ఈ స్థానానికి పోటీ చేసిన‌ప్పుడు నా యాస‌పై కామెంట్స్ చేశారు. ప్ర‌తికూల ప్ర‌చారాలు కూడా సాగాయి.

నేను డెమోక్ర‌టిక్ ప్రైమ‌రీకి పోటీ చేసినప్పుడు నేను గెల‌వ‌గ‌ల‌న‌ని నా స్వంత పార్టీ అనుకోలేద‌న్నారు సురేంద్ర‌న్. ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మీ భ‌విష్య‌త్తును ఎవ‌రూ నిర్ణ‌యించ‌రు. మ‌న‌ల్ని మ‌నమే నిర్ణ‌యించు కోవాల‌న్నారు.

Also Read : ధీర వ‌నిత‌ అవ‌ని చ‌తుర్వేది

Leave A Reply

Your Email Id will not be published!