Mahima Datla : వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ హబ్ గా మారింది. ఇప్పటికే బయో టెక్ ఆధ్వర్యంలో టీకా ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అవుతోంది. దాంతో పాటు బయోలాజికల్ లిమిటెడ్ – బీఈ కూడా చేరింది.
ఆ ఫార్మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ,చీఫ్ మహిమా దాట్లకు (Mahima Datla)అరుదైన గౌరవం లభించింది. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ – ఫబా బయో టెక్నాలజీ పరంగా చేసిన కృషికి గాను డాక్టర్ బీఎస్ బజాజ్ పేరుతో స్థాపించిన స్మారక అవార్డును ప్రకటించింది.
ఈనెల 11న సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 2022 సంవత్సరానికి గాను పురస్కారాలను వెల్లడించింది. కోవిడ్ -19కి వ్యతిరేకంగా ప్రపంచ వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేయడంలోనూ బయో లాజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్లకు డాక్టర్ బి.ఎస్. బజాజ్ మెమోరియల్ ఫబా ప్రత్యేక అవార్డు కు ఎంపిక చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం, ఫబా నిర్వహించే ఆసియా వార్షిక గ్లోబల్ బయో టెక్నాలజీ , లైఫ్ సైన్సెస్ సమ్మిట్ బయో ఆసియా 19 వ ఎడిషన్ సందర్భంగా ఈ అవార్డు మహిమ దాట్లకు అందజేస్తారు.
ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటిగా బయోలాజికల్ ఈ లిమెటెడ్ దేశంలో మొట్ట మొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అయిన కోర్బోవాక్స్ – టీఎం గుర్తింపు పొందింది.
ఇది శరీరంలో ఉన్న వైరస్ కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిగా ఉపయోగ పడుతుంది.
Also Read : పోరాటానికి ప్రతిరూపం ప్రియాంక