Rahul Gandhi Security : సెక్యూరిటీ లోపం యాత్ర‌కు ఆటంకం

నిలిచి పోయిన భార‌త్ జోడో యాత్ర

Rahul Gandhi Security : రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర శుక్ర‌వారం కాశ్మీర్ లోని బేనిహాల్ కు చేరుకుంది. ఈ యాత్ర‌లో జ‌మ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వ్య‌క్తి ఇమేజ్ కోసం కాకుండా దేశం కోసం తాను పాల్గొంటున్నాన‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

రాహుల్ గాంధీ, ఒమ‌ర్ అబ్దుల్లా లోయ‌లో 11 కిలోమీట‌ర్ల మేర న‌డవాల్సి ఉండ‌గా కిలోమీట‌ర్ త‌ర్వాత ఆగాల్సి వ‌చ్చింది. ఈ జోడోయాత్ర‌లో తీవ్ర‌మైన భ‌ద్ర‌తా లోపం నెల‌కొందని దీంతో రాహుల్ జోడో యాత్ర‌ను నిలిపి వేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

రాహుల్ గాంధీ కాశ్మీర్ లోకి ప్ర‌వేశించ‌గానే భారీ ఎత్తున జ‌నం త‌ర‌లి వ‌చ్చార‌ని, ఆయ‌న‌ను చూసేందుకు, మాట్లాడేందుకు యాత్ర‌లో పాల్గొనేందుకు ఉత్సుక‌త క‌న‌బ‌ర్చార‌ని పేర్కొంది. భ‌ద్ర‌తా సిబ్బందిని(Rahul Gandhi Security) ఆక‌స్మికంగా ఉప‌సంహ‌రించు కోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కాంగ్రెస్ పార్టీ.

జ‌మ్మూ కాశ్మీర్ ప‌రిపాల‌న విభాగం అర్ధాంత‌రంగా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో స‌డెన్ గా యాత్ర‌ను నిలిపి వేయాల్సి వ‌చ్చింద‌ని ఆరోపించింది పార్టీ. శ్రీ‌న‌గ‌ర్ కు వెళ్లే మార్గంలో బనిహాల్ ట‌న్నెల్ దాటిన త‌ర్వాత భారీ జ‌న‌స‌మూహం, త‌గిన భ‌ద్ర‌త లేక‌పోవ‌డంతో ఆపి వేయాల్సి వ‌చ్చింద‌ని మండిప‌డ్డింది.

ఈ విష‌యం గురించి కేసీ వేణుగోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రాహుల్ గాంధీ పాదయాత్ర చేప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : ప్ర‌తిప‌క్షాల‌ విమ‌ర్శ‌లు సిల‌బ‌స్ లో లేవు

Leave A Reply

Your Email Id will not be published!