Yang Huiyan : ఆసియా సంపన్న మహిళకు షాక్
రియల్ ఎస్టేట్ కొట్టిన దెబ్బ
Yang Huiyan : ఆసియాలో ఇప్పటి వరకు అత్యంత సంపన్న మహిళగా పేరొందిన చైనాకు చెందిన యాంగ్న్ హుయాన్ (Yang Huiyan) కి ఊహించని షాక్ తగిలింది.
ప్రధానంగా ఈ ప్రభావం చైనాలో చోటు చేసుకున్న రియల్ ఎస్టేట్ లో చోటు చేసుకున్న హెచ్చ తగ్గులు. ఏకంగా ఆమెకు సంబంధించిన మొత్తం ఆస్తిలో $12 బిలియన్లకు పైగా నష్ట పోయింది.
యాంగ్ హుయాన్ తన నికర విలువ ఏడాది కిందట #23.7 బిలియన్ల నుండి #11.3 బిలియన్లకు 52 శాతం కంటే ఎక్కువగా పడి పోయింది.
నగదు కొరతతో చైనా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది గత కొంత కాలం నుంచీ. గత ఏడాది కాలంలో సగానికి పైగా తన సంపదను కోల్పోయిందని బిలీయన్ ఇండెక్స్ గురువారం వెల్లడించింది.
చైనీస్ ప్రాపర్టీ దగ్గజం కంట్రీ గార్డెన్ లో మెజారిటీ వాటాదారు యాంగ్ హుయాన్ కు ఇది తీవ్రంగా ఎఫెక్ట్ పడేలా చేసిందని స్పష్టం చేసింది. నగదు సేకరించేందుకు కొత్త షేర్లను విక్రయిస్తామని కంపెనీ ప్రకటించింది.
ఇదే సమయంలో గ్వాంగ్ డాంగ్ కు చెందిన కంట్రీ గార్డెన్ లోని హాంకాంగ్ లిస్టెడ్ షేర్లు 15 శాతం పడి పొయింది. దీంతో యాంగ్ హుయాన్ అదృష్టానికి పెద్ద దెబ్బ తగిలింది జూలై 27న .
ఆమె తండ్రి కంట్రీ గార్డెన్ వ్యవస్థాపకుడు యాంగ్ గుయోకియాంగ్ 2005లో తన వాటాలను ఆమె కు బదిలీ చేసిన సమయంలో వారసత్వంగా పొందింది హుయాన్.
హాంకాంగ్ లో డెవలపర్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ వచ్చాక రెండేళ్ల తర్వాత ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా మారింది.
Also Read : ఆగని సంక్షోభం అధ్యక్షుడిపై ఆగ్రహం