Aakash Chopra : మయాంక్ పై ఆకాశ్ చోప్రా మండిపాటు
ఇలాగేనా కెప్టెన్ ఆడేదంటూ ఫైర్
Aakash Chopra : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఆఖరి అంకానికి చేరుకుంది. ఇక మిగిలింది కేవలం కొన్ని మ్యాచ్ లే. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ప్రస్తుతం 10 మ్యాచ్ లు గెలుపొంది 20 పాయింట్లతో అగ్ర భాగాన ఉంది.
ఇక రాజస్తాన్ రాయల్స్ , లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లలో ఏ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది.
గత సీజన్ లో పేలవమైన ఆట తీరును ప్రదర్శించిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఊహించని రీతిలో ఆడుతోంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ లో కీలకమైన మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో ఆడాల్సిన పంజాబ్ కింగ్స్ చేజేతులారా ఎందుకు ఓడి పోయిందని ప్రశ్నించారు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో మొదట పరుగులు ఇవ్వకుండా 160 పరుగులకే కట్టడి చేసింది పంజాబ్. కానీ తర్వాత 16 పరుగుల తేడాతో ఓటమి పొందడాన్ని తప్పు పట్టాడు ఆకాశ్ చోప్రా(Aakash Chopra).
దీనికి ప్రధాన కారణం బాధ్యతా రాహిత్యం తప్ప మరొకటి కాదని పేర్కొన్నాడు. ఈ ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ మయాంక్ అగర్వాలేనంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
ఇదే సమయంలో స్టార్ పేసర్ గా పేరొందిన కగిసో రబాడాతో 4 ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయించ లేదంటూ నిలదీశాడు ఆకాశ్ చోప్రా(Aakash Chopra). కాగా అసలైన మ్యాచ్ లో చాప చుట్టేసిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు అడుగంటి పోయాయి.
Also Read : దేశం గర్వించ దగిన విజయం