Aakash Chopra Siraj : మహమ్మద్ సిరాజ్ కు అంత సీన్ లేదు
ఆకాశ్ చోప్రా కీలక కామెంట్స్
Aakash Chopra Siraj : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ , క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) సంచలన కామెంట్స్ చేశాడు. హైదరాబాద్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ను ఏకి పారేశాడు. ఐపీఎల్ 2022లో సిరాజ్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు.
ప్రత్యర్థి జట్లు హైదరాబాద్ బౌలర్ ను ఉతికి ఆరేశారు. ప్రధానంగా రాజస్తాన్ రాయల్స్ తో ఆర్సీబీ ఆడిన క్వాలిఫయిర్ -2 మ్యాచ్ లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ దంచి కొట్టారు.
2 ఓవర్లలో 30కి పైగా పరుగులు ఇచ్చుకున్నాడు. రిచ్ లీగ్ లో పూర్తిగా నిరాశ పరిచాడు. ఒక రకంగా చెప్పాలంటే చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు సిరాజ్(Siraj) .
విచిత్రం ఏమిటంటే విరాట్ కోహ్లీ సపోర్ట్ కూడా ఉండడం వల్ల ఆర్సీబీ యాజమాన్యం ఈసారి ఏకంగా భారీ ఎత్తున ధరకు కొనుగోలు చేసింది. రూ. 10.75 లక్షలు వెచ్చింది..
హర్షల్ పటేల్ 15 మ్యాచ్ లు ఆడి 19 వికెట్లు తీస్తే సిరాజ్ 15 మ్యాచ్ లలో కేవలం 9 వికెట్లు మాత్రమే తీశాడు. 514 రన్స్ ఇచ్చాడు. బ్యాటర్లు సిరాజ్ బౌలింగ్ లో 31 సిక్సర్లు పిండుకున్నారు.
నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు ప్రధానంగా ఆర్సీబీ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు సిరాజ్ ను. తాజాగా ఆకాశ్ చోప్రా(Aakash Chopra Siraj) సంచలన కామెంట్స్ చేశాడు. వచ్చే సీజన్ లో అతడిని వదిలి వేస్తే బెటర్ అని సూచించాడు.
సిరాజ్ ను అంత ధర పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదని కుండ బద్దలు కొట్టాడు ఆకాశ్ చోప్రా. హాజిల్ వుడ్, హర్షల్ పటేల్ సూపర్ గా రాణించారని, కానీ సిరాజ్ పూర్తిగా ఎత్తి పోయాడంటూ ఎద్దేవా చేశారు.
Also Read : ఊపిరి పీల్చుకున్న అగర్వాల్ – భజ్జీ