బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రతి నెల నెలా పీఎం మన్ కీ బాత్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు. మోదీ దేశానికి ప్రధానిగా కొలువు తీరాక అక్టోబర్ 3, 2014లో మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత వరుసగా మన్ కీ బాత్ ప్రోగ్రాం దేశంలోనే టాప్ లో నిలిచింది.
వేలాది మంది స్పూర్తిదాయక కథలను, విజయాలను, ఆవిష్కరణల గురించి ప్రస్తావించారు. కోట్లాది మంది ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా స్పూర్తి పొందేలా చేశారు. ఈ క్రెడిట్ అంతా మోదీకే దక్కుతుందన్నారు అమీర్ ఖాన్. ఇదిలా ఉండగా మన్ కీ బాత్ 100 ఎపి సోడ్ పూర్తి చేసుకుంది. ఈ సంద్భరంగా కేంద్ర సర్కార్ జాతీయ సమ్మేళనం నిర్వహిస్తోంది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆవిష్కర్తలు, 250 సంస్థలు, సంఘాలను ఆహ్వానించారు.
ఈ సమ్మేళనం ఏప్రిల్ 30న జరగనుంది దేశ రాజధానిలో. ప్రత్యేక ఆహ్వానితులలో నటులు అమీర్ ఖాన్ తో పాటు రవీనా ఠాండన్ ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం అమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. తన స్పందనను తెలియ చేశారు. ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో పీఎంను మించిన వారు లేరని కితాబు ఇచ్చారు.